HBD Shivani Rajasekhar: 'అద్భుతం' చేయటానికి కుర్ర హీరోతో సిద్దం!
సినిమా ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్.. హీరోల వారసులు, హీరోయిన్ ల వారసులు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తమ లక్ పరీక్షించుకుంటూ ఉంటారు. అలా సినీ రంగంలో ప్రవేశించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ప్రస్తుతానికి రెండు సినిమాలు లైన్ లో పెట్టింది.. అందులో ఒకటి అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ సినిమా ఒకటి కాగా మరొకటి తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న అద్భుతం అనే సినిమా..
నిజానికి చెల్లి కంటే ముందే శివాని సినీ రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో ఆమె సినిమాలు ఆగిపోతూ ఉండగా చెల్లి నటించిన దొరసాని సినిమా రిలీజ్ కావడంతో తనకంటే ముందు చెల్లి హీరోయిన్ అయిపోయింది. ఇక ఈరోజు శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న అద్భుతం సినిమాకు సంబంధించిన ఒక లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో దర్శకుడిగా మల్లిక్ రామ్ పరిచయం అవుతుండగా కథ మాత్రం ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు.

ఇక ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జా, శివాని వేర్వేరు సమయాల్లో ఒక టేబుల్ మీద కూర్చుని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది.. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. మహా తేజ క్రియేషన్స్ మరియు ఎస్. ఒరిజినల్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. చంద్ర శేఖర్ మొగుల్ల - సృజన్ అరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'అద్భుతం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











