twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Republicకి షాక్.. ఆ సీన్స్ డిలీట్ చేయాలంటూ ఆందోళన.. కలెక్షన్స్ లో భారీ డ్రాప్!

    |

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న సాయి మెల్లగా కోలుకుంటూ ఉండగా ఈ మధ్యనే సోషల్ మీడియా వేదికగా నేను బాగానే ఉన్నాను, అంతా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దీంతో అభిమానులు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    సక్సెస్ సెలబ్రేషన్స్ రద్దు

    సక్సెస్ సెలబ్రేషన్స్ రద్దు

    సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1వ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా శని, ఆది వారాల్లో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

    జీ సంస్థ ప్రకటన

    జీ సంస్థ ప్రకటన

    నిజానికి ఇలాంటి గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత సక్సెస్ పార్టీ చేసుకోవాలి. కానీ సాయి తేజ ఇంకా కోలుకుంటున్నారు. ఆయన లేకుండా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సరైనది కాదని మేం భావిస్తున్నామని సాయి తేజ్ గారు చాలా త్వరగా కోలుకోవడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను అని రిపబ్లిక్ హక్కులు దక్కించుకున్న జీ సంస్థ ప్రకటన చేసింది.

    నాలుగో రోజు భారీ డ్రాప్స్

    నాలుగో రోజు భారీ డ్రాప్స్

    ఇక ఇక రిపబ్లిక్ సినిమా 4 రోజుల్లో ఏపీ తెలంగాణలో 4.85 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. మొదటి రెండు రోజుల్లో కాస్త బాగానే వసూళ్లు రాబట్టిన రిపబ్లిక్ మూడో రోజు ఏపీ తెలంగాణలో 1.85 కోట్ల షేర్ ను అందుకుంది, నాలుగో రోజు మరీ దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రిపబ్లిక్ సినిమా 5.51 కోట్ల షేర్ ను అందుకుంది.

    ఆగ్రహం

    ఆగ్రహం

    ఇక తాజాగా ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విషయంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు ప్రజలు ఆందోళనకు దిగారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో కొల్లేరును కాలుష్య కారకంగా, వ్యర్థాలతో చేపలు పెంచుతున్నట్లు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    Recommended Video

    Director Deva Katta Interview About Republic Movie | Sai Dharam Taj
    సుప్రీంకు వెళ్తాం

    సుప్రీంకు వెళ్తాం

    కొల్లేరులో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు... కొల్లేరు గురించి తప్పుగా చిత్రీకరిస్తే మేమంతా ఒక్కటేనని వారు పేర్కొన్నారు. కొల్లేరుపై చూపించిన సన్నివేశాలు తొలగించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు కొల్లేరు పరిరక్షణ సమితి రంగంలోకి దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇక సినిమాలో కొల్లేరు పేరును తెల్లెరుగా ప్రస్తావించారు.

    English summary
    kolleru people protest against republic movie in eluru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X