Just In
- 2 hrs ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- 3 hrs ago
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
- 4 hrs ago
సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!
- 4 hrs ago
ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- News
మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు... ఈసారి కేటాయింపులు ఎక్కువే... : సీఎం కేసీఆర్
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Lifestyle
Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...
- Automobiles
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను సెట్స్ పైకి తీస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధేశ్యామ్ అనంతరం రెబల్ స్టార్ తన స్పీడ్ ను మరింత పెంచనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. మొత్తానికి ప్రభాస్ కు జోడిగా గ్లామరస్ హీరోయిన్ ను ఫిక్స్ చేసేశారు.

అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కు గురి చేశాయి
గత కొంతకాలంగా సలార్ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో నటించే పాత్రలకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. అయితే ఫైనల్ గా రూమర్స్ కు చిత్ర యూనిట్ బ్రేక్ వేసింది.

మొదట వాళ్లే హీరోయిన్స్ అన్నారు
సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయంలో చాలా రోజులుగా రుమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట దిశా పటాని, కీయరా అద్వానీ, కత్రినా కైఫ్ అంటూ కథనాలు చాలానే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ జోడిగా సీనియర్ స్టార్ హీరో కూతురిని సెలెక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.

పుట్టినరోజున స్పెషల్ గా..
నేడు శృతి హాసన్ 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు హోంబల్ ప్రొడక్షన్ హౌజ్ వారు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి సలార్ మహారాణి శృతి హాసన్ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల శృతి హాసన్ క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

ఇక సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
సలార్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే టీమ్ తో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి యాక్షన్ డోస్ మామూలుగా ఉండదు. ఇక సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కేవలం రెండు నెలల్లోనే తన షూటింగ్ పార్ట్ ను ముగించుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.