Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బాలయ్యకు ఆ హీరోయిన్ ఓకే చెప్పలేదట: మరో ఇద్దరిపై ఫోకస్ చేసిన గోపీచంద్
నటసింహా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారాయన. ఇది షూటింగ్ పూర్తి కాకముందే టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు, నాలుగు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 'అఖండ' షూట్ పూర్తయిన వెంటనే దీన్ని షురూ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
నందమూరి బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్‌ను తీసుకుంటున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందన్న టాక్ వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీనికి శృతి హాసన్ ఇంకా ఓకే చెప్పలేదట. గోపీచంద్ మలినేనితో ఉన్న స్నేహం రిత్యా నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఇందులో నటించని పక్షంలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ క్లారిటీగానే ఉందని టాక్.

శృతి హాసన్ ఇందులో నటించనని చెబితే.. ఆమె స్థానంలో సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఆమె కూడా వర్కౌట్ కాకపోతే నయనతారతో సంప్రదింపులు జరపాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్టుగా, పోలీసుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.