twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో Expiry Date వెబ్ సిరీస్.. స్నేహా ఉల్లాల్ గ్రాండ్ ఎంట్రీ

    |

    నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి ద్విభాషా వెబ్ సిరీస్ ఎక్స్‌పైరీ డేట్. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న జీ 5లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. ఈ నెల 9న తెలుగు వెర్షన్ విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు.

    లవ్ అఫైర్లు, చీకటి సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆసక్తికరమైన కథతో తెరకెక్కిందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. రిలేషన్‌షిప్స్ కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో మూవీ రూపొందింది. డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన వైఫ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.‌ తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇస్తుంది. అతడు కూడా అదే పెళ్ళికి వెళతాడు.‌ వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? అనే విషయం వెబ్ సిరీస్ ట్రైలర్‌లో ఆసక్తిని రేపుతున్నది.

    Sneha Ullal entry into Web series with Expiry Date in Zee5, Trailer released

    వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ద్రోహం, మోసం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఊహించని మలుపులతో సాగుతుందని 'జీ 5' వర్గాలు తెలిపాయి. ఎక్స్‌పైరీ డేట్‌తో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ డిజిటల్ తెరంగేట్రం చేస్తున్నారు.

    ట్రైలర్ విడుదలైన సందర్భంగా స్నేహా ఉల్లాల్ మాట్లాడుతూ.. భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తం పది ఎపిసోడ్స్‌తో సిరీస్ ఉంటుంది. ఇందులో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్, ఊహించని మలుపులు ఉంటాయి అని అన్నారు.

    వెబ్ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ "తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'. రెండు భాషల్లోని ప్రతిభావంతులైన నటీనటులతో దీన్ని రూపొందించాం. అందరూ అద్భుతంగా నటించారు. 'జీ 5'లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను నిర్మించినందుకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

    English summary
    ZEE5 always presents unparalleled entertainment to its viewers across genres and languages. The platform just released the gripping trailer of Expiry Date that will have you hooked to your seat. ‘Expiry Date’ is an edge of the seat suspense thriller with unexpected twists in every episode, interwoven with love, trust, deceit and vengeance. What makes it unique is that it's the first-ever bilingual web-series, which will start premiering on October 2 (in Hindi) and October 9 (in Telugu). Directed by Shankar K Marthand, produced by Northstar Entertainment Pvt Ltd., the series stars Sneha Ullal, Tony Luke, Madhu Shalini and Ali Reza.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X