Just In
- 5 min ago
‘మాస్టర్’ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 26 min ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
- 27 min ago
బాలీవుడ్‌లోకి ‘క్రాక్’: రవితేజ పాత్రలో రియల్ హీరో.. అదిరిపోయే ప్లాన్ రెడీ
- 45 min ago
Vakeel Saab Teaser: ఆరో స్థానంతో సరిపెట్టుకున్న పవన్.. అందులో మాత్రం రెండో ప్లేస్
Don't Miss!
- Lifestyle
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- News
ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్
- Sports
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలాగైనా సరే ఆ సినిమాను తప్పకుండా చేస్తాను.. డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సోహెల్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ అయినప్పటికీ అతనికంటే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ సోహెల్. ఫైనల్ వరకు వచ్చిన అతను టాప్ 3లో ఉండగానే చాలా తెలివిగా అడుగులు వేశాడు. ప్రైజ్ మనీలో సగం ఆఫర్ వచ్చినప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయం బాగానే ఉపయోగపడింది. ఇక ప్రస్తుతం హీరోగా అబిజిత్ కంటే వేగంగా ఛాన్సులు అందుకుంటున్న సోహెల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా వివరణ ఇచ్చాడు.

ఒక్కసారిగా పెరిగిన క్రేజ్
బిగ్ బాస్ సీజన్ 4లో పెద్దగా అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన నటుడు సోహెల్. సీరియల్స్ లోనే కాకుండా పలు సినిమాల్లో చాలా తక్కువ స్థాయిలో సైడ్ రోల్స్ చేసిన సోహెల్ ఎంత ట్రై చేసినా గత ఏడాది వరకు బ్రేక్ దొరకలేదు. కేవలం బిగ్ బాస్ 4 ద్వారానే సోహెల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. హౌజ్ లో అతని స్టైల్ అలాగే బాషాతోనే సరికొత్తగా అకట్టుకోవడం బాగా కలిసొచ్చింది.

జార్జిరెడ్డి టీమ్ తో కొత్త సినిమా
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సోహెల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయట. కానీ సోహెల్ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి మేకర్స్ తో ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

సింగరేణి ముద్దుబిడ్డగా..
ఇక రీసెంట్ గా తన సొంతజిల్లా కరీంనగర్ లో అభిమానులు కొందరు ప్రత్యేకంగా సోహెల్ ను సన్మానించారు. అందులో భాగంగా ఒక హోటల్ లో జరిగిన సభలో సోహెల్ తన జిల్లా వాసులు చూపిస్తున్న ప్రేమపై చాలా పాజిటివ్ కామెంట్స్ చేశాడు.సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పుకుంటు అభిమానుల మద్దతు పొందిన సోహెల్ ఫైనల్ లో కూడా అదే తరహాలో ప్రశంసలు అందుకున్నారు.

అలాంటి కోణంలో ఒక సినిమా..
అయితే సింగరేణి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని సోహెల్ అనుకుంటున్నాడట. సభలో సోహెల్ తనకు కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమా చేయాలని ఉందని వివరణ ఇచ్చారు. తన జిల్లా వాసులు చూపిస్తున్న ప్రేమ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది అంటూ.. తప్పకుండా అలాంటి కోణంలో ఒక సినిమాను తేవడానికి ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. మరి అతని వద్దకు రాబోయే దర్శకులు ఎలాంటి కథలను పట్టుకొస్తారో చూడాలి.