‘సాహో’ నుంచి కొందరు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మళ్లీ చూడండి: సుజీత్
'సాహో' రిలీజైన తర్వాత దర్శకుడు సుజీత్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఇన్‍స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 17 సంవత్సరాల వయసులో నేను షార్ట్ ఫిల్మ్ తీసినపుడు నా వద్ద డబ్బు లేదు, టీమ్ లేదు కానీ ఆర్కుట్, ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్‌లో 90 శాతం నేనే షూట్ చేసి, డైరెక్షన్ చేసి, ఎడిటింగ్ చేశాను.. చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. విమర్శలు నా జర్నీకి మరింత బూస్ట్ ఇచ్చాయి. చాలా దూరం ప్రయాణించాను, చాలా కష్టాలు ఫేస్ చేశాను, కానీ ఎప్పుడూ నెవర్ గివప్ అప్ అనే మూడ్లోనే ఉన్నట్లు తెలిపారు.
ఇపుడు చాలా మంది 'సాహో' చూశారు. కొందరు దీని నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ చాలా మంది సినిమాను ఇష్టపడ్డారు. సినిమాను చూసిన అందరికీ థాంక్స్. మీరు ఏమైనా మిస్సయి ఉంటే మరోసారి సినిమా చూడండి, మీరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు... అని సుజీత్ చెప్పుకొచ్చారు.

సుజీత్ చేసిన ఈ పోస్టుపై 'సాహో' యాక్టర్, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ రియాక్ట్ అయ్యారు. 'గాడ్ బ్లెస్ యూ బ్రదర్'... మీరు రత్నం లాంటి సినిమా తీసినందుకు గర్వపడాలి. నేను చూసిన, నటించిన సినిమాల్లో టెక్నికల్‌గా ఇది బెస్ట్ ఫిల్మ్. ఒక అభిమానిగా నా ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రం చూశాను. ఎక్కడా డిసప్పాయింటుకు గురి కాలేదు.' అన్నారు.
వేరొకరి కష్టాన్ని జడ్జ్ చేయడం చాలా సులభం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలను ఒకే సినిమాలో చూపించడం అంత ఈజీ కాదు. ఇంత పెద్ద సినిమాను నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేశావు. మీతో, యువి క్రియేషన్స్ వారితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను అని నీల్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











