లాక్‌డౌన్ ’సాయం‘లో చేదు అనుభవాలు.. అన్నీ పుస్తకంలో బయటపెడుతా.. సూన్‌సూద్
కష్టాలు వచ్చినప్పుడే ఎవరు ఎలాంటి వారు అనే విషయాలు బయటకు వస్తాయి. ప్రజా అభిమానంతో కోట్లు సంపాదించి వెనకేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆదరించిన అభిమానుల కోసం కాస్త సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అలాంటి వారిలో సోనూ సూద్ ఒకరు. భయంకరమైన విలన్ గా వెండితెరపై అలరించిన ఈ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం స్టార్ హీరోలకంటే కూడా గొప్పవాడే. ఇక లాక్ డౌన్ లో వలస కార్మికులకు చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాల గురించి ఈ హీరో ఒక పుస్తకం రాయబోతున్నాడు.

అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు
ఈ కష్టకాలంలో వీలైనంత వరకు సహాయం చేయాలని అనుకున్న సోనూ సూద్ అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఇంకా చాలా మందికి సహాయం చేస్తాడట. మిడియాకు ముందస్తు ప్రచారాలు లేకుండా వలస కార్మికులను సొంత ఇళ్లకు చేర్చాలని లాక్ డౌన్ మొదటి రోజు నుంచే ఈ యాక్టర్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చెసి బస్సులను ఏర్పాటు చేశాడు.

వారి చేదు అనుభవాలు..
ఇంటికి చేరుకుంటే చాలు భగవంతుడా అని చాలా మంది కూలీలు వేల కిలోమీటర్లు నడవడానికి కూడా సిద్ధమయ్యారు. అలాంటి వారి కోసం సోనూ సూద్ అందించిన సాయం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సహాయం చేసే విధానంలో సోనూ సూద్ కి ఎన్నో విషయాలు తెలిశాయట. మనుషుల చేదు అనుభవాలు, కష్టాలు ఇలా అన్ని విషయాలు అతన్ని ఎంతగానో బాదించాయట.

పుస్తకం రూపంలో..
ఈ లాక్ డౌన్ లో ఎదురైన అనుభవాల గురించి అలాగే సహాయం పొందినప్పుడు వారిలో చూసిన ఆనందం గురించి సోనూ సూద్ ఒక పుస్తకం రాస్తున్నారు. ఇటివల ఈ విషయంపై స్పందించిన ఈ స్టార్ యాక్టర్ వలస కార్మికుల కోసం దాదాపు 16 నుంచి 18 గంటల పాటు పని చేయాల్సి వచ్చిందట. సొంత గ్రామాలకు వెళుతున్నాము అనే సంతోషం వారిలో చూసినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని సోనూసూద్ తెలిపారు.
Recommended Video

రాజకీయాల కోసం..?
లైఫ్ చెంజింగ్ పేరుతో రాస్తున్న పుస్తకంలో సోనూ సూద్ ఎలాంటి విషయాలపై ప్రస్తావిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సీనియర్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశాలపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయం గురించి కూడా సోనూ సూద్ ప్రస్తావించే అవకాశం ఉందట. అయితే సోనూ సూద్ లాంటి వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా మరింత ఉపయోగపడతాడాని ఇప్పటికే సోషల్ మీడియాలో కోట్లాది మంది మద్దతు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











