twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె రిచెస్ట్ ఇండియన్, రియల్ హీరో.. ఏపీ యువతి గురించి సోనూసూద్‌ ఆసక్తికర ట్వీట్!

    |

    సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు, దస్కం, కీర్తి ప్రతిష్ట కాదు సాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. ఈ రోజుల్లో అలాంటివాళ్లు దొరకటం చాలా అరుదు. అసలు ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే తనను ఇంతటి వాడిని చేశారు అన్న ఏకైక కారణంతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాక భారతదేశంలో అందరికీ సాయం చేస్తున్నారు. ఏ మూలన ఏ అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఆయన దృష్టికి తీసుకువెళ్లినా సరే ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అలాగే తనలా సేవ చేయాలనే కోరిక ఉన్న అందరూ డబ్బు సాయం చేసేందుకు గాను సోనూసూద్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

    ఇప్పటిదాకా ఆయనకు ఎంతమంది విరాళాలు అందించారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక దివ్యాంగురాలు అయిన యువతి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వరికుంటపాడు అనే గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు అంధత్వంతో బాధపడుతున్నారు. అయినా సరే ఏ మాత్రం తనలో ఆత్మన్యూనతా భావం లేకుండా తాను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఆవిడ తాజాగా సోనూసూద్ ఫౌండేషన్కు 15 వేల రూపాయలు విరాళంగా అందించారు. అది కూడా ఆమె ఆమె రెండు నెలలుగా తీసుకుంటున్న పెన్షన్ మొత్తం.

    Sonu sood interesting tweet about andhra pradesh lady

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఐదు నెలల పెన్షన్ ను ఆమె సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె గురించి ట్వీట్ చేసిన సోనూసూద్ తనవరకు ఆవిడ భారతదేశంలో ధనికురాలు అని పేర్కొన్నారు, అలాగే ఒకరి బాధను అర్థం చేసుకోవడానికి కళ్ళతోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆవిడ ఒక నిజమైన హీరో అని సోనూసూద్ కొనియాడారు. ఇక సదరు యువతితో సోనూసూద్ ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ మేరకు సదరు యువతి తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు.

    English summary
    As we all know real hero Sonu sood is contributing his own money for all medical expenses for people all over India. He is helping all the people who has contacted him through the various methods of communication. Recently a blind girl and in youtuber from Andhra Pradesh has contributed a money of 15000 rupees To Sonu sood Foundation. Sonu announced this on his Twitter. he stated For me ''she's the RICHEST Indian, You don't need eyesight to see someone's pain'', A True Hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X