స్వార్థం లేదు.. సేవ చేయడమే నా లక్ష్యం.. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. సోను సూద్
తెలంగాణా ప్రభుత్వంలోని సీఎస్ఆర్ సెల్ తెలంగాణా సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ T SIG కోవిడ్-19 వారియర్స్ ఈవెంట్'ని హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 8 నవంబర్, 2021న నిర్వహించింది. 2020 మరియు 2021లో COVID-19 ద్వారా ప్రభావితమైన వారికి సహాయం అందించిన వ్యక్తులను మరియు సంస్థలను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించింది.

ఐటీ, పరిశ్రమ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ITE&C మరియు పరిశ్రమల శాఖ జయేష్ రంజన్ సోనూ సూద్, ప్రముఖ సామాజిక కార్యకర్త... కళాకారుడు, 12 కార్పొరేట్ సంస్థలు, 26 NGOలు, 29 అసాధారణ వ్యక్తులు, 6 సమన్వయ సంస్థలను స్వయంగా సత్కరించారు. దాదాపు 850 పైచిలుకు సంస్థలు, వ్యక్తులను ఇ-సర్టిఫికేట్‌ల (ఎలక్ట్రానిక్) ద్వారా కూడా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తారక రామారావు మాట్లాడుతూ..మహమ్మారి సమయంలో అవిశ్రాంతంగా పనిచేసిన సంస్థలను మరియు వ్యక్తులను గుర్తించినందుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్‌ని నేను అభినందిస్తున్నాను. ఈ సంక్షోభం మనలో ఉన్న అత్యంత సానుభూతిని కూడా వెల్లడించేలా చేసింది. ఈ కార్యక్రమం ద్వారా గుర్తించబడిన వారందరికీ నా శుభాకాంక్షలు.
ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు కళాకారుడు శ్రీ సోనూ సూద్ మాట్లాడుతూ, "దేశం అదృశ్యమైన మరియు ఘోరమైన శత్రువుతో పోరాడుతున్నప్పుడు, మానవత్వం యొక్క ఈ సైనికులు ముందంజలో ఉన్నారు, మంచి పోరాటానికి నాయకత్వం వహించి, తమ స్వార్థం కంటే ఇతరులను సేవ చేయడం ముఖ్యం అని భావించి ముందుకు నడిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (TSIG) టీం కి అభినందనలు తెలియజేసారు.
జయేష్ రంజన్ మాట్లాడుతూ, "మానవత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, సమాజ శ్రేయస్సు కోసం తెగువని చూపించిన ఎందరో గొప్ప హీరోలని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రజలు సంఘటిత ప్రయత్నంతో సమాజంలోని వివిధ వర్గాలకు మద్దతునిస్తూ ఉంటారని మేము ఆశిస్తున్నాము".
2018లో స్థాపించబడిన తెలంగాణ-సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, తెలంగాణ అధికారిక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వేదిక. T-SIG రాష్ట్రంలోని అనేక కార్పొరేట్ సంస్థలు, NGOలు, ప్రభుత్వ శాఖలు మరియు జిల్లా పరిపాలనలోని అధికారులతో విస్తృతంగా పనిచేస్తుంది. T-SIG రాష్ట్రంలో అతిపెద్ద ఇంపాక్ట్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌లు మరియు ప్రాజెక్ట్ మూల్యాంకన నివేదికల వంటి నిర్దిష్ట సేవలను కార్పొరేట్‌లకు అందించడమే కాకుండా వివిధ వాటాదారులకు ఉచితంగా సేవలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications











