For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేయర్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూసూద్.. దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చిన నటుడు!

  |

  కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనిషి నిజమైన దేవుడు అని సోనూసూద్ నిరూపించాడు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఎంతోమంది సంపన్నులు కరోనా కష్టకాలంలో దాక్కొని ఉంటే సోనూసూద్ మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి ఎంతోమందికి సహాయం చేయాడు. సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ గత కొన్నేళ్లుగా తన నటనతో మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్న సోను సూద్.. ప్రస్తుతం చేస్తున్న సామజిక సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత ఏడాది కరోనా సమయంలో ఎందరో వలస కూలీలు, కార్మికులకి వారి వారి స్వస్థలాలకు చేరేలా పలు రవాణా సౌకర్యాలు కల్పించిన సోను సూద్, ఆ తరువాత అనేకమంది పేద వారికి తనవంతుగా డబ్బు, ఇతర వస్తువులు వంటి అనేకానేక సహాయాలు అందించారు.

  పాలిటిక్స్ లోకి వస్తే బెటర్..

  పాలిటిక్స్ లోకి వస్తే బెటర్..

  ఇక అతను పాలిటిక్స్ లోకి వస్తే బెటర్ అని చాలామంది అన్నారు. అయితే ఇటీవల ఆ విషయంపై సోనూసూద్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతకొంత కాలంగా సోషల్ మీడియా అకౌంట్స్ ని ఒక మంచి మార్గంలా చేసుకుని కష్టం వచ్చింది సర్ కాపాడండి అంటూ అర్ధించిన ప్రతి ఒక్కరికీ తనవంతుగా సాయమందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇక ప్రస్తుతం కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా పలు రాష్ట్రాల్లో తన సేవా ట్రస్ట్ ద్వారా పలు ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

  చివరి శ్వాస వరకు సేవలోనే..

  చివరి శ్వాస వరకు సేవలోనే..

  తన వద్ద ఉన్న డబ్బు భగవంతుడు తనకు వీలైనంతలో ఇతరులకు సాయం చేయమని ఇచ్చినదని, తన చివరి శ్వాస వరకు అందరికీ వీలైన సాయం చేయగలగడమే తన లక్ష్యం అని, అలానే ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే రాబోయే రోజుల్లో మన దేశం కష్టాల్లో నుంచి ఈజీగా బయట పడుతుందని పలు సందర్భాల్లో సోను సూద్ వెల్లడించారు.
  ఇక కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం సోను సూద్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని పలువురు భావించారు.

  మేయర్ ఎన్నికల్లో..

  మేయర్ ఎన్నికల్లో..

  మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అక్కడి మేయర్ ఎన్నికల కోసం రాబోయే రోజుల్లో సోనూసూద్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. వారి పార్టీ నుండి అభ్యర్ధిగా సోను సూద్ ని ప్రకటించనున్నారు అంటూ పలువురు వార్తలు వెల్లడించడంతో అది ఏమాత్రం నిజం కాదని, ప్రస్తుతం తనకు ఒక సాధారణ పౌరుడిగా జీవిస్తున్న జీవనం ఎంతో ఆనందాన్నిస్తుందని, తనకి ఆ తృప్తి చాలని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా మరోసారి సోనూసూద్ వెల్లడించారు.

   భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు

  భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు

  సోనూసూద్ ఇచ్చిన ఆన్సర్ తో ఆయన రాజకీయ తెరంగేట్రంపై ప్రచారం అవుతున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడినట్లు అయ్యింది. ఇక ప్రస్తుతం సోనూసూద్ సౌత్ నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా కనిపిస్తున్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సోను సూద్ మరికొన్ని ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ప్రజల కోసం సొంత ఆస్తులు కూడా వదులుకోవడానికి కూడా సిద్ధమని తెలుపడంతో జనాలు అతని మనసుకి మరింత దగ్గరవుతున్నాడు. సోను సూద్ వంటి గొప్ప వ్యక్తి, చిరకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పలువురు ప్రేక్షకాభిమానులు ఆయనపై ప్రేమని కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Sonu sood shocking comments on his political entry gossips
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X