For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SIIMA 2021: అసలైన సినిమా మహోత్సవానికి డేట్ ఫిక్స్.. సైమా ఈవెంట్ ఈసారి మన దగ్గరే!

  |

  సినిమాల స్థాయిని, విలువలను గుర్తించే అవార్డుల మహోత్సవాలు చాలా కాలంగా ఎక్కడా జరగడం లేదు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా సినిమా బిజినెస్ నాయితే భారీ స్థాయిలో పడిపోయింది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరిస్థితులు ఎప్పటికప్పుడు సినిమాలకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. టాలీవుడ్ లో అయితే టికెట్స్ రేట్స్ వంటి విషయాల వలన కూడా నిర్మాతలు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇక చాలా సినిమాలు వాయిదా పడుతూ పోటీ పడేందుకు సిద్ధం అయ్యాయి. ఒకప్పుడు చిన్న సినిమా విడుదల అయినా కూడా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ వన్ అంటూ ఎన్నో సంబరాలు జరిగేవి.

  కానీ కరోనా వైరస్ కారణంగా ఆ ఆర్భాటాలకు చిత్ర పరిశ్రమ కాస్త దూరంగానే ఉంటుంది. ఇక సినిమాల స్థాయిని గుర్తుచేసే అవార్డు మహోత్సవాలను చూసి చాలా కాలం అయ్యింది. అయితే త్వరలోనే సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖమైన అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లో జరగనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం చివరగా 2019లో కత్తర్ లో జరిగింది. ఇక రెండు సంవత్సరాల అనంతరం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

  తెలుగు మలయాళం కన్నడ తమిళ్ వంటి సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన ఈ అవార్డుల ప్రదానోత్సవం లో వేలాది మంది సినిమా తారలు పాల్గొంటారు. సన్ నెట్వర్క్ ఆధ్వర్యంలోనే ఈ వేడుక ఉత్సవం జరుగుతుంది. మొదట 2012 జూన్ లో మొదలైన సైమా అవార్డు ప్రయాణం 2019 వరకు గ్యాప్ లేకుండా కొనసాగింది. దుబాయి, సింగపూర్ మలేషియా వంటి దేశాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించే వారు. ఇక కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో గత ఏడాది వేడుకలను నిర్వహించ లేదు. ఇక ఈ సారి మరో దేశంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలను రెండు రోజులపాటు భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నారు.

  South Indian International Movie Awards event date and place fix

  కానీ ఆ ప్లాన్స్ ఏవి కూడా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే తెలంగాణలోని హైదరాబాదులోనే ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలని సైమా నిర్వాహకులు ప్లాన్ సెట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు అవార్డుల ప్రధానోత్సవం జరగనుందట. విషయాన్ని సైమా నిర్వాహకులు అధికారికంగా ఒక పోస్టు ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ కోలీవుడ్ అక్కడ తారలతో పాటు అలాగే కన్నడ మలయాళం సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు హీరోయిన్స్ కూడా రాబోతున్నట్లు సమాచారం.

  ఎంత మంది పాల్గొన్న కూడా కొంతమంది సీనియర్ నటీనటులు టెక్నీషియన్స్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ థర్డ్ వేవ్ రోజురోజుకు మరింత అనుమానాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆ విషయంలో తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అయితే అత్యంత జాగ్రతల నడుము కొనసాగుతున్నాయి. కొందరు సీనియర్ హీరోలు నటి నటులు అయితే సినిమాలు ఎక్కువగా చేయవద్దని కూడా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు ఏ విధంగా సక్సెస్ అవుతాయో చూడాలి.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  The wait is over! Most awaited South Indian International Movie Awards (SIIMA2021) is back. Celebrating Cinema on September 11th & 12th in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X