twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రియులకు ఇక పండుగే: ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్‌లో తొలిసారి ఈ రేంజ్‌లో!

    |

    కరోనా మహమ్మారి ప్రభావం మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమ మీద ఎక్కువగా చూపిస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది లాక్‌డౌన్ వల్ల థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. అదే సమయంలో చాలా మంది సినీ కార్మికులు సైతం పనులు లేక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. దాని నుంచి తేరుకుని గత డిసెంబర్‌లో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి సీజన్ కూడా సోసోగానే పూర్తైంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో సినిమాలకు బిగ్ షాక్ తగిలినట్లైంది.

    SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్

    సుదీర్ఘ విరామం తర్వాత గత శుక్రవారం (జూలై 30)న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు', తేజ సజ్జా 'ఇష్క్' చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున: ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో, ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ సినిమాలు ప్రదర్శితం అయ్యాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే దక్కుతోంది. అయితే, కొన్ని సమస్యల కారణంగా కలెక్షన్లు మాత్రం పెద్దగా రావడం లేదు. ఫలితంగా కొన్ని సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వారం అంటే ఈరోజు ఏకంగా ఏడు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి ఒకేరోజు తెలుగులో ఇన్ని సినిమాలు విడుదల కావడం ఇదే తొలిసారి.

     SR Kalyanamandapam and 6 Movies Releasing Today

    ఈరోజు 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'మ్యాడ్', 'ముగ్గురు మొనగాళ్లు', ' మెరిసే మెరిసే', 'క్షీర సాగర మథనం', 'రావణలంక', 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే చిత్రాలు విడుదల అవుతున్నాయి. నైజాం, ఏపీలోని అన్ని ప్రాంతాల్లో వీటన్నింటికీ థియేటర్లు మంచిగానే దక్కాయి. దీంతో ఒకేరోజు ఈ ఏడు చిత్రాలు బాక్సాఫీస్ ముందు ఫైట్ చేయబోతున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం.. శ్రీధర్ గాదె కాంబోలో వస్తున్న 'ఎస్ఆర్ కల్యాణమండపం'పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే, దీని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అత్యధిక మొత్తంలో జరిగింది.

    అరాచకమైన ఫొటోలతో సెగలు రేపుతోన్న యువరాజ్ మాజీ ప్రేయసి.. ఇంత ఘాటుగా ఎవరినీ చూసుండరు!అరాచకమైన ఫొటోలతో సెగలు రేపుతోన్న యువరాజ్ మాజీ ప్రేయసి.. ఇంత ఘాటుగా ఎవరినీ చూసుండరు!

    మిగిలిన చిత్రాల విషయానికి వస్తే.. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యాడ్'. లక్ష్మణ్ మేనేని దీన్ని తెరకెక్కించాడు. యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో ఇది రూపొందింది. అలాగే, శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో మరో చిత్రం 'మెరిసే మెరిసే'. దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ సినిమాను పవన్ కుమార్ తెరకెక్కించారు. మానస్, సంజయ్ కుమార్, అక్షత సోనావని నటించిన చిత్రం 'క్షీర సాగర మథనం'. దీన్ని అనిల్ పంగులూరి తెరకెక్కించారు.

    క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం 'రావణలంక'. బీఎన్ఎన్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్, వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. విడుదలకు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

    టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

    English summary
    After Theaters Opening Few Movies Released. Now Today SR Kalyanamandapam, Mad, Mugguru Monagallu, Merise Merise, Ksheera Sagara Madanam, Ravanalanka and Ippudukaka Inkeppudu Releasing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X