శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్..బ్రాతో కనిపిస్తూనే, చెయ్యక తప్పట్లేదు.. నన్ను క్షమించండంటూ!
చేసిన సినిమాల కంటే ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అని అంశంతోనే నటి శ్రీరెడ్డి ఫేమస్ అయింది. తనను చాలా మంది లైంగిక గా వాడుకున్నారని సినిమా అవకాశాల పేరుతో ఎన్నో రోజుల పాటు వాడుకుని తనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని చెబుతూ ఆమె మీడియా కెక్కింది. తాజాగా ఈ భామ బ్రాతో కనిపించి షాకిచ్చింది. అంతేకాక అలా కనిపించినందుకు క్షమించాలి అని కూడా కోరుతోంది ఆ వివరాల్లోకి వెళితే

న్యూస్ రీడర్ గా మొదలయి
సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీరెడ్డి నేను నాన్న అబద్దం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాకి సీక్వెల్ గా జరిగిన అరవింద్ 2 అనే సినిమాలో కూడా ఆమె కనిపించింది.

లైంగిక వేధింపులు
అయితే తాను చాలా కాలం నుంచి సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా తనను లైంగికంగా వాడుకుంటున్నారు తప్ప సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని చెబుతూ తెలుగు లో అనేక మంది దర్శక నిర్మాతలు పేర్లు అలాగే ఒక నిర్మాత కొడుకుతో ఏకంగా ఫోటోలు రిలీజ్ చేసి రచ్చ చేసింది.

పొలిటికల్ ఎంట్రీ కోసం వేట
ఈ దెబ్బకు ఆమెకు విపరీతమైన గుర్తింపు కూడా లభించింది. ఇక టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి వెళ్లిన శ్రీ రెడ్డి అక్కడ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక అది కూడా వర్కౌట్ కాక పోవడంతో పొలిటికల్ ఎంట్రీ కోసం వేట మొదలు పెట్టింది శ్రీరెడ్డి.

బ్రాతో కనిపించి
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉండే ఆమె ఇప్పుడు ఎక్కువగా పాలిటిక్స్ మీద ఫోకస్ పెడుతోంది. నిన్నటికి నిన్న తనకు రాజకీయంగా ఏదో ఒక అవాకాశం కల్పించాలని కోరిన ఆమె ఇప్పుడు బ్రాతో కనిపించి షాకిచ్చింది.

ఇలా చేయండి అన్తీ
ఆమె స్పోర్ట్స్ బ్రాతో దర్శనం ఇస్తూ తన బాడీ ఇలా మెయింటెయిన్ కావడానికి కారణం ఇదేనని చెబుతూ కొన్ని వర్కౌట్స్ చేసి చూపింది. ఇక ఈ మధ్యన తన సొంతగా యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించిన ఆమె బ్యూటీ టిప్స్‌తో పాటు.. తన చేతి వంటల రుచి కూడా చూపిస్తోంది.
Recommended Video

నన్ను క్షమించండి
ఇక ఈ బ్రాషోకి పొలిటికల్ అటాక్స్ వస్తాయని భావించిందో ఏమో కానీ రాజకీయాలోకి రావాలని వున్నా ఈ లోగా మా బ్రతుకు మేము బ్రతకాలిగా అవకాశం ఇస్తారో లేదో ..ఇలా చేస్తే అన్నా మా సోషల్ మీడియాల్లో మాకు పైసా ఇస్తారని చెప్పుకొచ్చింది. ఇష్టం లేక పోయినా చెయ్యక తప్పట్లేదు..వైసీపీ తమ్ముళ్లు నన్ను క్షమించండి అంటూ ఆమె రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











