For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBDMaheshBabu: మహేశ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ సర్‌ప్రైజ్.. ఆ వీడియోతో అసలైంది రివీల్ చేసేసిన గురూజీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయా కలయికల్లో సినిమాలు రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. అప్పుడెప్పుడో వీళ్లిద్దరి కలయికలో 'అతడు' అనే సినిమా వచ్చింది. దీని తర్వాత 'ఖలేజా'కూ కలిసి పని చేశారు.

  ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం ఈ రెండు చిత్రాలనూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. దీంతో వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే వీళ్లిద్దరి ప్రాజెక్టు రాబోతుందన్న ప్రకటన వెలువడింది. తాజాగా ఇప్పుడు దీని నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదలైంది.

  అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మహేశ్

  అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మహేశ్

  ఆ మధ్య రెండు మూడు భారీ డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొంత కాలంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేసిన ‘భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి రూపొందించిన ‘మహర్షి', యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన ‘సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు విజయాలను అందుకున్నాడు. తద్వారా సూపర్ స్టార్ మహేశ్ బాబు హిట్ల హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు అనుగుణంగానే ముందుడుగు వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు.

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  సర్కారు వారి పాట పాడుతున్నాడు

  సర్కారు వారి పాట పాడుతున్నాడు

  హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్న మహేశ్ బాబు ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.

  మరో సినిమాను ప్రకటించిన మహేశ్

  మరో సినిమాను ప్రకటించిన మహేశ్

  ‘సర్కారు వారి పాట' సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, ఈ సంవత్సరం ఆరంభంలో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తైన తర్వాత మరోసారి లాక్‌డౌన్ రావడంతో ఇది బాగా ఆలస్యం అవుతోంది. దీనిపై మహేశ్ బాబు అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తదుపరి సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు ఈ స్టార్ హీరో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  NTR Insta Take over RRR: రాజమౌళి కొడుకుతో రామ్ చరణ్ గొడవ.. సీక్రెట్ వీడియో లీక్ చేసిన ఎన్టీఆర్

  పనులన్నీ పూర్తి చేసేసిన త్రివిక్రమ్

  పనులన్నీ పూర్తి చేసేసిన త్రివిక్రమ్

  ‘అతడు', ‘ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు మహేశ్ బాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌తో చేసే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేసేశాడని అంటున్నారు. అలాగే, థమన్ కూడా ఈ చిత్రం కోసం అప్పుడే మూడు నాలుగు పాటలను రెడీ చేసి పెట్టాడని అంటున్నారు. మొత్తం ప్రీ ప్రొడక్షన్‌తో పాటు మరిన్ని పనులు పూర్తయ్యాయి.

  మహేశ్‌కు గురూజీ స్పెషల్ విషెస్

  మహేశ్‌కు గురూజీ స్పెషల్ విషెస్

  ఈరోజు (ఆగస్టు 9) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు నటిస్తోన్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట' నుంచి పుట్టినరోజు కానుకగా ‘సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనితో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేయనున్న సినిమా నుంచి కూడా ఓ సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు యూనిట్ నిన్ననే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ చిత్ర బృందం నుంచి అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఎంతగానో వైరల్ అవుతోంది.

  ఆ వీడియోతో రివీల్ చేసేసిన గురూజీ


  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న సినిమా నుంచి తాజాగా వీడియో విడుదలైంది. ఇందులో ఈ చిత్రానికి పని చేస్తున్న టెక్నీషియన్ల వివరాలు వెల్లడించారు. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్, నిర్మాతగా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఈ వీడియో ద్వారా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇక, చివర్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈ ఏడాది ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నిలవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

  #HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. అప్పటి నుంచే

  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. అప్పటి నుంచే


  తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే మూవీ నుంచి మహేశ్ బాబుకు శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన వీడియోలో అతడిని స్టైలిష్ లుక్‌లో చూపించారు. ఇక, ఈ వీడియోపై సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఫలితంగా ట్విట్టర్‌లో SSMB28 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక, ఈ సినిమా వచ్చే అక్టోబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.

  English summary
  Mahesh Babu recently Announced his 28 film with Trivikram Srinivas. Now This Movie Unit Released A Special Video on The Occasion of Mahesh Birhday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X