Just In
- 15 min ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 1 hr ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 2 hrs ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
Don't Miss!
- News
మూడు రాజధానులపై సైలెన్స్- మున్సిపోల్స్‌లో వైసీపీ, టీడీపీ మౌనం- షాకింగ్ రీజన్స్
- Sports
విరాట్ కోహ్లీ ఆధునిక తరానికి హీరో: స్టీవ్ వా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాక్షసుడిలా మారుతున్న అల్లు అర్జున్.. పుష్ప కోసం మూడు గంటల పాటు కదలకుండా..
బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న సమయంలో నటీనటులు అనుకున్న దానికంటే ఎక్కువగానే కష్టపడుతున్నారట.

స్పీడ్ పెంచిన సుకుమార్
పుష్ప షూటింగ్ కోసం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదట.
రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా ఈ ఎడాది ఆగస్టు 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా షూటింగ్ 70% పూర్తి చేయాల్సి ఉంది. ఇక తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు సుకుమార్ అయితే స్పీడ్ పెంచినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది.

3గంటల పాటు కదలకుండా..
నవంబర్ లో మొదలైన రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఇటీవల ఫినిష్ చేశారు. ఇక సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం బన్నీ గంటల తరబడి రెడీ అవ్వాల్సి వస్తోందట. మేకప్ కోసమే మూడు గంటల సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మేకప్ వేసే క్రమంలో కదలకుండా అలానే గంటల తరబడి ఉండడం అంత సామాన్యమైన విషయం కాదు.

అల్లు అర్జున్ నట విశ్వరూపం
బన్నీ కెరీర్ లో ఇంతవరకు ఏ పాత్ర కోసం కూడా ఏ రేంజ్ లో కష్టపడలేదు. ఊర మాస్ క్యారెక్టర్ అయిన పుష్ప బిగ్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించడం కాయమని తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లో బన్నీ కష్టాన్ని చూసి యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారాట.

పని రాక్షసుడిలా..
ఒక్క మాటలో చెప్పాలి అంటే అల్లు అర్జున్ పని రాక్షసుడిలా మారినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా కూడా నటిస్తున్నాడట. ఇక మొన్న ముగిసిన షెడ్యూల్ లో అయితే 500 మందితో ఒక యాక్షన్ సీన్ ను షూట్ చేసినట్లు తెలిసింది. ఆ ఒక్క సీన్ సినిమా మొత్తంలో హైలెట్ గా ఉంటుందని టాక్ వస్తోంది. మరి పుష్ప సినిమాతో బన్నీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.