Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hunt: హాలీవుడ్ స్టంట్ మాస్టార్స్ తో 'హంట్'కు సిద్ధమైన సుధీర్ బాబు.. రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. సినిమాలు హిట్ట్ అయిన ఫ్లాప్ అయిన తనదైన శైలీలో సినిమాలు చేసుకుంటూ నైట్రో స్టార్ గా ఎదిగాడు. ఇటీవల ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకులను సుధీర్ బాబు పలకరించిన పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవడంతో ఎలాగైన హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు. ఈ క్రమంలోనే మరో కొత్త మూవీతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వీ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం హంట్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

పోలీస్ ఆఫీసర్లుగా..
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. 'హంట్' సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుధీర్ లుక్.. ఆయన కళ్లలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ ఈ పోలీస్ ఆఫీసర్లుగాకనిపించనున్నారు.

హాలీవుడ్ స్టంట్స్ కొరియోగ్రాఫర్స్ తో..
ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించిన సందర్బంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "మా 'హంట్' సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు అందరినీ సినిమా అలరిస్తుంది. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. సినిమా రెడీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు.'జాన్ విక్ 4'కి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, 'పాపతో పైలం...' పాటకుసూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని తెలిపారు.

రిపబ్లిక్ డే కానుకగా..
సుధీర్ బాబు తాజా సినిమా హంట్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు పలు పాత్రలు పోషించగా జిబ్రాన్ సంగీతం అందించారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Locked & Loaded 😎💥
— Bhavya Creations (@BhavyaCreations) December 30, 2022
The intense & high action thriller #HuntTheMovie hitting BIG SCREENS on 26th January 2023💥 #HuntFrom26Jan@isudheerbabu @bharathhere @actorsrikanth @Imaheshh @ChitraShuklaOff #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @PulagamOfficial pic.twitter.com/A1QKBJVZuL