Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hunt Trailer: ప్రభాస్ తో మొదలైన హంట్.. హైలెట్ గా సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా వరుసపెట్టి చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించగా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తర్వాతి చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుధీర్ బాబు. ఈ క్రమంలోనే తాజాగా హంట్ సినిమాతో వేట మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ప్రభాస్ చేతులమీదుగా..
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హంట్ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా హంట్ మూవీ ఉన్నట్లు సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్ చుట్టూ హంట్ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది.

యాక్షన్ ప్రియులకు ట్రీట్..
ట్రైలర్ లోకి వెళితే.. అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్ కి కారు యాక్సిడెంట్ జరిగి గతం మరిచిపోతాడు. దీంతో అతను విచారించాల్సిన ఒక ముఖ్యమైన కేసు మధ్యలోనే ఆగిపోతుంది. ఆ కేస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసింది కేవలం అర్జున్ కి మాత్రమే. ఈ క్రమంలో ఆ కేసును ఎలాగైన పూర్తి చేయాలని పై అధికారి (హీరో శ్రీకాంత్) ఆదేశిస్తాడు. ఇలా మెమోరీ లాస్ అయిన పోసీస్ ఆఫీసర్ అర్జున్ ఆ కేసు కోసం ఏం చేశాడు.. ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేది ట్రైలర్ లో చూపించారు. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ప్రియులకు మంచి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్..
ఇక ప్రభాస్ ట్రైలర్ తో స్టార్ట్ చేసిన ఈ హంట్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. అలాగే ఇందులో మౌనిక రెడ్డి, మైమ్ గోపి, జిల్ కబీర్ దుహాన్ సింగ్, గోపరాజు రమణ, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మార్వెల్ చిత్రాలకు పనిచేసిన రేనాడో ఫవెరో, బ్రయాన్ విజియర్ స్టంట్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం వాళ్లు హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ జాన్ విక్ 4కి వర్క్ చేస్తున్నారు. రేనాడో ఫవెరో, బ్రయాన్ విజియర్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు హంట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకనిర్మాతలు తెలిపారు. ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రభాస్ కు ధన్యవాదాలు తెలియజేశారు నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్.