For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sridevi Soda Center Official Trailer: తొలిసారి అలా కనిపించిన సుధీర్ బాబు

  |

  సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ సుధీర్ బాబు. ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతో కష్టపడే అతడు.. అప్పట్లోనే 8 ప్యాక్ బాడీతో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అంతేకాదు, ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి... అక్కడ పలు చిత్రాల్లో నటించాడు. తద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అయితే, అతడికి ఈ మధ్య కాలంలో హిట్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి.

  Raja Raja Chora Twitter Review: శ్రీవిష్ణు కెరీర్‌లో తొలిసారి.. ప్లస్ మైనస్ ఇవే.. మూవీ ఎలా ఉందంటే!

  అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్' తర్వాత సుధీర్ బాబు ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోలేదు. కానీ, రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'పలాస' వంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన కరుణ కుమార్‌తో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే చిత్రాన్ని చేశాడు. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తైనా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది.

  Sudheer Babus Sridevi Soda Center Official Trailer Released

  చాలా రోజులుగా సరైనా విజయం కోసం వేచి చూస్తోన్న సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఈ సినిమా అఫీషియల్‌ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్లు, టీజర్‌లో వినోదాత్మక ప్రేమకథగా కనిపించిన ఈ చిత్రం.. ట్రైలర్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ మూవీగా రూపొందినట్లు అర్థం అయింది.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  లైట్‌మెన్‌గా పని చేసే ఓ కుర్రాడు.. శ్రీదేవి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరి ప్రేమకు కులం అడ్డొస్తుంది. ఈ క్రమంలోనే ఈ జంట కథలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతాయి. దీంతో హీరో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయాలను తాజాగా విడుదలైన ట్రైలర్‌లో చూపించారు. ఇక, ఇందులో సుధీర్ బాబు నటన అందరినీ ఆశ్చర్య పరిచింది. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన హైలైట్ అనే చెప్పాలి. ఈ భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అలాగే, మూవీ ఎలా ఉండబోతుందో కూడా చక్కగా చూపించారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్లకు అమ్ముడు పోయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను కరుణ కుమార్ దర్శకత్వంలో 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

  English summary
  Sudheer Babu Recently Did a Film Sridevi Soda Center Under Karuna Kumar Direction. Now Tollywood Star Hero Mahesh Babu Launched This Movie Official Trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X