For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రంగస్థలం ప్రెసిడెంట్ పాత్రకు స్ఫూర్తి ఆయనే.. కూలీ డబ్బులతో సినిమాకు.. సుకుమార్ భావోద్వేగం

  |

  కొత్త నీరు రావాలి.. పాత నీరు పోవాలి అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. సినీ పరిశ్రమకు అది చాలా అవసరం కూడా. అయితే పాత నీరు ఎప్పటికీ నిలిచే ఉంటున్నా.. ఈ మధ్య కాలంలో కొత్త నీరు వచ్చి చేరుతుంది. కొత్త డైరెక్టర్లు, నటీనటులు, నిర్మాతలు వచ్చి మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. పెళ్లి చూపులు, కేరాఫ్ కంచెరపాలెం, మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు కొత్త దర్శకులు తెరకెక్కించగా.. కొత్త వారు నటించన సినిమాలే . తాజాగా అలాంటి మరో చిత్రం రాబోతోంది. రాజావారు రాణివారు అంటూ వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను సుకుమార్ విడుదల చేశాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.

   అది చాలా గొప్ప విషయం..

  అది చాలా గొప్ప విషయం..

  ఈ సినిమా టీజర్ చూడగానే డైరెక్టర్ రవి కిరణ్ ఫోన్ చేసి అభినందించానని తెలిపాడు. ఆ అబ్బాయి వయసు 25 ఏళ్లు.. ఇంతకు ముందు ఎవరిదగ్గరా పనిచేయలేదని చెప్పుకొచ్చాడు. కానీ ఫుల్ ఎనర్జీతో సినిమాను డీల్ చేశాడని కొనియాడాడు. అతని నేరేషన్ స్టైల్ డిఫరెంట్‌గా ఉందని ప్రశంసించాడు. ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు కెమెరాను కథకు అనుగుణంగా మూవ్ చేయడం.. విజువల్స్ మీద అంత కమాండ్ ఉండటం చాలా గొప్పగా అనిపించిందని ఆయన పనితనాన్ని పొగిడాడు.

  అంతా కొత్త వాళ్లే..

  అంతా కొత్త వాళ్లే..

  ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా కొత్తవాళ్లేనని చెప్పుకొచ్చాడు. తాను ఆర్య చేస్తున్నప్పుడు తన టీంలో చాలామంది కొత్త వాళ్లు ఉన్నారని గుర్తు చేసుకున్నాడు. అందులో ఒక్కడు తప్ప అందరూ డైరెక్టర్లు అయ్యారని తెలిపాడు. ఇప్పుడు ఈ సినిమా టీం చూస్తుంటే.. తనకు ముచ్చటేస్తుందని తెలిపాడు. ఈ సినిమా తాను ఇంకా చూడలేదు కాబట్టి మంచి రిజల్ట్ ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఖచ్చితంగా రవికిరణ్ మంచి డైరెక్టర్ అవుతాడని చెప్పుకొచ్చాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాడు. ఒక అన్నం మెతుకు చాలు అంటారు అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఈ సినిమా గురించి నీ గురించి చెప్పడానికి ఈ ట్రైలర్ చాలని ప్రశంసించాడు. ఇక సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటింగ్ అంతా కొత్తవాళ్లే. ట్రైలర్ కటింగ్ అదిరిపోయిందని, హీరోహీరోయిన్లు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారని అన్నాడు.

  నా కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే వాడికి కన్నీళ్లు..

  నా కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే వాడికి కన్నీళ్లు..

  ఈ సినిమాలో నటించిన మా కిట్టయ్య గురించి చెప్పాలని అన్నాడు. వీడి గురించి చెప్పాలంటే.. తన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నాడు. ఎప్పుడో కనిపించినప్పుడు భుజం మీద చేయి వేసే ఫ్రెండ్ కాదనీ, వీడు నిజమైన ఫ్రెండ్ అని చెప్పాడు. తన కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే వాడికి కన్నీళ్లు వస్తాయని తెలిపాడు. తనకు చిన్న బ్యాక్ పెయిన్ అన్నా ముందు బాధ పడేది కూడా అతననేని అన్నాడు.

  ప్రెసిడెంట్ క్యారెక్టర్‌కు స్ఫూర్తి..

  ప్రెసిడెంట్ క్యారెక్టర్‌కు స్ఫూర్తి..

  తన చిన్నతనంలో కిట్టయ్య.. ఓ సారి ఊరి ప్రెసిడెంట్ వాయిస్‌ను ఇమిటేట్ చేశాడని, ఆ ప్రెసిడెంట్‌ను చూస్తే అందరికీ భయమేస్తుందని తెలిపాడు. ఆయనే రంగస్థలం ప్రెసిడెంట్ పాత్రకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. ఆయన అంతా గంభీరంగా ఉంటారని, అందరూ భయపడుతూ ఉంటారని అన్నాడు. అయితే మా ఫ్రెండ్ ఆయన గొంతును ఇమిటేట్ చేశాడని తెలిశాక.. తిడతాడని అనుకుంటే మంచి భవిష్యత్తు ఉందని అభినందించాడని చెప్పుకొచ్చాడు.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  కూలీ డబ్బులతో సినిమా..

  కూలీ డబ్బులతో సినిమా..

  చిన్నప్పటి నుండి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. వీడు కూలిపని చేసి నన్ను సినిమాలకు తీసుకుని వెళ్లేవాడు. నాకు సినిమా అంటే ఇష్టం అన్ని పొద్దున్నంతా పని చేసి సాయంత్రం వచ్చి నాకు సినిమా చూపించేవాడు. ఇప్పుడు వాడి గురించి చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వీడు మంచిగా ఇమిటేట్ చేస్తాడు. నేను 100% లవ్‌లో మంచి క్యారెక్టర్ ఇచ్చాను. తరువాత నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ ఇదే అనుకుంటా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలనుకుంటున్నా' అంటూ తన స్నేహితుడి గురించి చెప్పి స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యారు సుకుమార్. ఇక సుకుమార్ తన గురించి చెప్తుంటే.. కన్నీటి పర్యంతమై స్టేజ్ మీదే ఏడ్చేశాడు ‘రాజావారు రాణిగారు' చిత్రంలో నటించిన క్రిష్ణయ్య.

  కాగా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించగా.. ఆయనకు ఇదే తొలిచిత్రం. సినిమాటోగ్రాఫర్స్ విద్యా సాగర్, అమర్.. మ్యూజిక్ : జై క్రిష్, ఎడిటింగ్ : విప్లవ్ ఇలా అంతా కొత్తవాళ్లతో సరికొత్త ప్రయోగంగా ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు వస్తోంది‘రాజావారు రాణిగారు'.

  English summary
  Sukumar Emotional Speech At Raja Varu Rani Garu Event. He Revealed About Hi sBest Friend Kittaiah. And he Recalled His Old Memories Becomes Emotional On Stage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X