For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గల్లీ రౌడీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది: థియేటర్లలో నవ్వుల జల్లు కురిసేది అప్పటి నుంచే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ ఒకడు. కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. కథల ఎంపికలో తేడా కొట్టడంతో కెరీర్ ఆరంభం నుంచీ వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్' మినహా పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోయిన అతడు.. ఆ మధ్య వచ్చిన 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మళ్లీ పలు పరాజయాలతో నిరాశే ఎదురైంది.

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  హిట్ కావాల్సిన తరుణంలో ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. దీంతో ఈ మూవీ ఏవరేజ్‌గానే ముగిసింది. ఇక, ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు 'గల్లీ రౌడీ' అనే సినిమాతో రాబోతున్నాడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దీన్ని తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలపై తాజాగా యూనిట్ నుంచి అదిరిపోయే ప్రకటన వెలువడింది.

  Sundeep Kishans Gully Rowdy Release on September 3rd

  'గల్లీ రౌడీ' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైనా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయబోతున్నారని చాలా రోజుల పాటు ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని ఇటీవల సందీప్ కిషన్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసి పలు పాటలను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది.

  75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ మేరకు హీరో సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'గల్లీ రౌడీ సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. అందరూ సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక, పోస్టర్‌లో 'ఢీ.. రెడీ.. దూకుడు చిత్రాలకు కథ అందించిన రచయిత నుంచి వస్తున్న గల్లీ రౌడీ.. నవ్వుల దాడి మొదలవబోతుంది' అంటూ రాసుకొచ్చారు.

  ఘాటు ఫొటోతో హీటు పెంచేసిన రాయ్ లక్ష్మీ: స్విమ్‌సూట్‌లో అందాలు మొత్తం కనిపించేలా!

  Sundeep Kishans Gully Rowdy Release on September 3rd

  పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రాబోతున్న 'గల్లీ రౌడీ'పై అంచనాలు బాగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, హర్షలు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తోంది.

  English summary
  Tollywood Young Hero Sundeep Kishan Now Doing Gully Rowdy Movie Under G Nageshwar Reddy Direction. This Movie Will be Release on September 3rd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X