సమంత క్రేజీ మూవీ బాలీవుడ్‌లోకి.. డైరెక్టర్ ఎవరంటే!
తమిళంలో ఘనవిజయం సాధించిన సూపర్ డీలక్స్ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్నట్టు బాలీవుడ్ పత్రికలు కథనాలు వెల్లడించాయి. సమంత అక్కినేని, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, మిస్కిన్, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి త్యాగరజాన్ కుమారరాజా దర్శకత్వం వహించారు.

సూపర్ డీలక్స్ హిందీలో రీమేక్ అవుతున్నది. హిందీలో కూడా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్నారు అని ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనంపై త్యాగరాజన్ మాట్లాడానికి నిరాకరించడం గమనార్హం.
అయితే బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వాని ఈ సినిమాపై మోజుపడ్డారని, త్వరలోనే త్యాగరాజన్ ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని కథనాలు వెల్లవడుతున్నాయి.
మార్చి 29న రిలీజైన ఈ చిత్రం దక్షిణాదిలో ఘన విజయం సాధించింది. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో తమిళ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ మహిళగా నటించి ప్రేక్షకులను మెప్పించారనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











