twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Narappa OTT Release : వెంకటేష్ కి కూడా ఇష్టం లేదు..కానీ ఆయన వల్లే ఇలా, ఓపెన్ అయిన సురేష్ బాబు

    |

    విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నారప్ప డిజిటల్ వేదికగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి జరుగుతున్న ప్రచారం నిజమయింది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దీనికి సంబందించిన అర్హికరిక ప్రకటన చేసింది. అయితే వెంకటేష్ ఫ్యాన్స్ మొదలు సినిమా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో అసలు ఈ సినిమాని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని పంచుకున్నాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    డిజిటల్ రిలీజ్ ఫిక్స్

    డిజిటల్ రిలీజ్ ఫిక్స్


    ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాను తెలుగులో నారప్ప అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరిందని జూలై 20న నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు.

    స్పందించిన సురేష్ బాబు

    స్పందించిన సురేష్ బాబు

    మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకటేష్ నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవడం గురించి వెంకీ ఫాన్స్, థియేటర్ యాజమాన్యాలు చాలా గుర్రుగా ఉన్నాయి. అయితే సురేష్ బాబు దీని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతా నారప్ప ప్రొడ్యూసర్ ఇష్టమేనని పేర్కొన్న ఆయన.. నా చేతుల్లో ఏం లేదు.. అంటూ ఈ ఓటీటీ రిలీజ్ పై దాటవేత ప్రయత్నం చేశారు.

    ఆయన కూడా ఎంటర్ అవ్వడంతో

    ఆయన కూడా ఎంటర్ అవ్వడంతో

    తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ధనుష్ నటించిన అసురన్ మూవీ మొదటి సారి చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నిర్మాత కలైపులి థానుకి ఫోన్ చేసి ఈ సినిమా రీమేక్ చేయోచ్చని చెబుతూ రీమేక్ రైట్స్ అడిగితె.. ఆయన తానూ ప్రొడ్యూస్ చేస్తా అన్నారని, అందుకే ఇద్దరం కలిసి సినిమాని నిర్మించామని ఆయన వెల్లడించారు.

    ఆ సినిమాతో నష్టం

    ఆ సినిమాతో నష్టం


    నారప్ప షూట్ మొదలు పెట్టినప్పుడు ఓటిటి రిలీజ్ అనుకోలేదన్న ఆయన కలైపులి నిర్మించిన కర్ణన్ కరోనా సెకండ్ వేవ్ కి ముందు రిలీజ్ చేయగా.. రెండు వారాలకే థియేటర్స్ క్లోజ్ అయ్యాయని, దీంతో కర్ణన్ కి నష్టాలు వచ్చాయని అన్నారు. మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ అంటున్న సమయంలో నారప్ప థియేటర్స్ లో రిలీజ్ చేసి నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలా ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆయన ఫోన్ చేసి అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి డీల్ వచ్చింది అని ఇచ్చేదామని అంటే అప్పటికే నష్టపోయిన ఆయనతో ఏం అనలేక పోయానని అన్నారు.

    ఆయనకు కూడా ఇష్టం లేదు

    ఆయనకు కూడా ఇష్టం లేదు


    అయితే తన తమ్ముడు వెంకటేష్ కి నారప్ప ఓటీటీ రిలీజ్ అసలు ఇష్టం లేదని, ఫాన్స్ ఫోన్ చేసి ఫీలయ్యారని చెప్పారని అన్నారు. ఎవరు బాధపడ్డా కానీ మరో మార్గం కనిపించలేదు అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. తనకు స్వయంగా థియేటర్లు ఉన్నాయని పేర్కొన్న ఆయన తనకి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుసనీ అన్నారు. ఓటీటీ అనేది అశాశ్వతమన్న ఆయన మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

    English summary
    Finally Suresh Babu has now broken silence over the Narappa OTT release. he says that Narappa is co-jointly produced by Kalaippuli S Thanu, the producer of Asuran. due to him film is going to released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X