నంద గోపాల లీలలకు సెన్సార్‌ ఫిదా.. సూర్య మూవీకి గ్రీన్ సిగ్నల్

విలక్షణ నటుడు సూర్య నటించిన ఎన్‌జీకే (నంద గోపాల కృష్ణ) చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. రాజకీయ అంశాలతో ఆధారంగా, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ సెల్వరాఘవన్. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తమిళంలో గత ఆరేళ్లలో సెల్వరాఘవన్‌కు సంబంధించిన ఏ సినిమా విడుదల కాకపోవడం, ఏడాదిన్నరగా సూర్య సినిమా రిలీజ్ కాకపోవడం, ఆ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Suriyas NGK movie gets UA certificate

ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు ఎన్‌జీకే చిత్రాన్ని చూసి సంతృప్తిని వ్యక్తం చేశారనేది తాజా సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఎన్‌జీకే చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తూనే మరో పక్క సూర్య సూరరాయ్ పొట్రూవోమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గురు ఫేం సుధా కొంగర దర్శకురాలు. అలాగే కేవీ ఆనంద్ దర్శకత్వంలో కాప్పన్ సినిమాక కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X