Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటున్న సుశాంత్.. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్
తెలుగు చిత్రసీమలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఎక్కువగా వస్తున్నాయి. నయా దర్శకనిర్మాతలు విలక్షణ, వైవిద్యభరితమైన కథాంశాలు రూపొందించేందుకే మక్కువ చూపుతున్నారు. సినిమాకు ఎంతటి ఆదరణ వస్తుందనే దాన్ని పక్కన పెట్టేసి తమ తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'.
సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. రవిశంకర్ శాస్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గురువారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి వెంకటరత్నం కెమెరా స్విచాన్ చేశారు. యోగేశ్వరి క్లాప్ కొట్టారు. నాగసుశీల గౌరవ దర్శకత్వం వహించారు. మీనాక్షీ చౌదరి ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ ''అల వైకుంఠపురములో' సక్సెస్‌తో ఈ ఏడాది ప్రారంభం చాలా బాగుంది. చక్కని థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఈ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. చాలా కొత్తగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా'' అన్నాడు. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ శాస్త్రి స్పందిస్తూ.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఈ కథ ఎంచుకున్నాం. దీనికి సుశాంత్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పారు.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాలో వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.