For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోహన్ బాబుకు కోపం వల్లే చాలా కోల్పోయాడు.. మంచు విష్ణు విజయం సాధిస్తాడాని ముందే చెప్పా..

  |

  ఎంతో ఆసక్తికరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక శనివారం మంచు విష్ణు మా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది సినీ నటీనటులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మా వాతావరణంపై అలాగే మంచు విష్ణుపై తనదైన శైలిలో స్పందించారు. సాధారణ ఎన్నికలకు తలపించేలా మా ఎన్నికలు జరిగాయని మాట్లాడారు.

  10 రోజుల ముందుగానే చెప్పా..

  10 రోజుల ముందుగానే చెప్పా..

  తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మంచు విష్ణు ప్యానెల్ ను ఎన్నుకున్న సభ్యులకు అందరికి ధన్యవాదాలు.
  విష్ణు విజయం సాధిస్తారు అని నేను 10 రోజుల ముందుగానే చెప్పాను. విష్ణు ప్యానెల్ లో ఎన్నికైన సభ్యులందరికి శుభాకాంక్షలు. మా అసోసియేషన్ అంటే ఒక చిన్న కమిటీ కాదు. ఇది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంత పెద్ద వ్యవస్థ బాధ్యత ఇప్పుడు యువకుడు మంచు విష్ణు మీద ఉంది.. అని అన్నారు.
  చదువు, సంస్కారం, గవరమైన వ్యక్తిత్వం మోహన్ బాబు మంచు విష్ణుకు నేర్పించాడు. ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువ అని అందరికి తెలుసు. అయితే
  కోపం, ఆవేశం వల్ల మోహన్ బాబు నష్టపోయారు కానీ ఆయన కారణంగా ఇతరులను ఎప్పుడు నష్టపరచలేదు. తప్పును తప్పు అని దైర్యంగా చెప్పే వ్యక్తి మోహన్ బాబు గారు.. అని తలసాని మాట్లాడారు.

  గత 25 ఏళ్లుగా..

  గత 25 ఏళ్లుగా..

  ఇక మోహన్ బాబు గారితో నాకు ఉన్న భంధం ఈనాటిది కాదు. మాది అన్నదమ్ముల అనుబంధం. గత 25 ఏళ్లుగా ఉంది. అంతే కాకుండా విద్యాసంస్థలను స్థాపించి ఆయన చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ ఏడాది మంచి ప్యానెల్ ను మా సభ్యులు ఎన్నుకున్నారు.. మా ప్యానెల్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి తప్పకుండా సహాయ, సహకారాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను అని అన్నారు.

  సింగిల్ విండో ద్వారా..

  సింగిల్ విండో ద్వారా..

  ఇక సినిమా ఇండస్ట్రీ కి హైద్రాబాద్ హబ్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. సింగిల్ విండో ద్వారా ఫిల్మ్ డేవలప్మెంట్ కార్పొరేషన్ లో అప్లై చేసుకుంటే అన్ని అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు అంటూ.. ఆన్ లైన్ టికెటింగ్ కు తెలంగాణ రాష్ట్రంలోనే అంకురార్పణ జరిగిందని తెలియజేశారు. షూటింగ్ కి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని అన్నారు.

  థియేటర్ లొనే సినిమా..

  థియేటర్ లొనే సినిమా..

  మొన్నటి వరకు కరోన కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. పైరసీని కూడా అరికట్టాలి. అందరిని థియేటర్ లొనే సినిమా చూడాలని కోరుతున్నాను. ఇక దాదాపు కరోనా కష్ట కాలంలో 14 వేళా మంది కళాకారులకు ప్రభుత్వం తరపున సహాయం చేసాము. కలమతల్లి అందరి జీవితాలను మార్చింది. ఈ విషయాన్ని చాలా మంది కళాకారులు మర్చిపోయారు..
  28 ఏండ్ల తర్వాత కూడా మా లో ఇబ్బందులు ఉన్నాయి.. అని అన్నారు.

  త్వరలో ముఖ్యమంత్రి వద్ద మా మీటింగ్

  ఇండస్ట్రీ మొత్తం కలిసి ఒక్కతాటి పై ఉంటే 900 కాదు 9000 మందిని నడిపించే సత్తా ఉంది. ఇందుష్ట్రీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజన్ ఉంది. రానున్న రోజులో అన్ని రకాల సహకారాలు ఉంటాయి. త్వరలో ముఖ్యమంత్రి వద్ద మా కమిటీతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. చిత్రపురి కాలనీ విషయంలో కూడా ప్రభుత్వం పరంగా కళాకారులకు అండగా ఉన్నాము. కొత్త కళాకారులు వచిన్నపుడే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. గెలుపొందిన అందరికి అభినందనలు. మా తీసుకునే నిర్ణయాల వెనుక మేము ఉన్నాము. ప్రభుత్వం సహకారం ఉంటుంది. అర్హులైన కళాకారులకు ప్రభుత్వ పథకాలు వచ్చే విదంగా చర్యలు తీసుకుంటాను. ఇండస్ట్రీలో అందరిని కలుపుకొని విష్ణు ప్యానెల్ ముందుకు వెళ్లాలని తలసాని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.

  English summary
  Talasani Srinivas Yadav about mohan babu angry and maa elections,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X