Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
యాక్షన్ కథా చిత్రంలో తమన్నా భాటియా.. ప్రముఖ దర్శకుడితో..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కూడా ఓ హీరోయిన్‌గా చేస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రాగ్‌లో జరుగుతున్నది. ఎఫ్2 చిత్రంలో నటిస్తూనే తమిళంలో విశాల్‌తో ఓ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కత్తి సందాయ్ అనే చిత్రంలో విశాల్ సరసన తమన్నా నటించారు.
సుందర్ సీ దర్శకత్వంలో విశాల్‌తో రూపొందే చిత్రంలో నటిస్తున్నాను. ఆ సినిమాను అంగీకరించాను. సుందర్ సార్‌తో పనిచేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సినిమాగా రూపొందుతున్నది. ఈ సినిమాలో నాకు యాక్షన్ సీన్లు ఉన్నాయి అని తమన్నా తెలిపింది.

ప్రస్తుతం క్వీన్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న మహాలక్ష్మీ, ఎఫ్2 చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్నది. కన్నె కలైమాన్ను అనే తమిళ సినిమాలో కూడా ఓ పాత్రను పోషిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో కూడా ఓ కీలక పాత్రను దక్కించుకొన్నారు. చివరిసారిగా తెలుగులో నా నువ్వే చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది.