విజయ్ సేతుపతితో తమన్నా షూటింగ్.. అందుకే వచ్చానంటూ స్పెషల్ పోస్ట్!

తమన్నాకి ఒక టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మాస్టర్ షెఫ్ పేరుతొ తెలుగులో ప్రారంభం కానున్న ఒక కుకింగ్ షోకి ఆమె హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే దానిని ఆమె ఈ మధ్యనే రివీల్ కూడా చేసింది. అయితే ఇదే షోని తమిళంలో విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. అలా అక్కడ ఆయన హోస్ట్ చేస్తుండగా ఇక్కడ తెలుగులో మాత్రం తమన్నా ఆయన ప్లేస్ తీసుకుంటోంది.

ఇక ఒక రకంగా విజయ్ సేతుపతి మరియు తమన్నా ఇద్దరు సౌత్ లో మంచి ఫేమస్ నటులు. అయితే ఈ ఇద్దరూ త్వరలో టీవీలో కనిపించబోతున్నారు. అయితే ఇద్దరూ కలిసి కాదనుకోండి, వేర్వేరుగా. జెమిని టివిలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ తెలుగు షోకు హోస్ట్‌గా తమన్నా వ్యవహరించనుండగా, సన్ టివి షో తమిళ వెర్షన్‌ను విజయ్ సేతుపతి హోస్ట్ చేయనున్నారు. బిగ్ బాస్ వంటి షోలను నిర్మిస్తోన్న ఎండిమోల్ షైన్ గ్రూప్ తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం ఈ షోను నిర్మిస్తోంది.

Tamannaah bhatia with Vijay Sethupathi for a special shoot

తమన్నా మరియు విజయ్ సేతుపతి తమదైన శైలిలో ఈ షోలకు ఎలా క్రేజ్ తీసుకువస్తారో చూడాలి. ఈ మధ్యనే తమన్నా మరియు విజయ్ సేతుపతి ఇద్దరూ తమ షోల కోసం ప్రోమో కోసం చిత్రీకరించారు, త్వరలో వాటిని ప్రసారం చేయబోతున్నారు. ప్రోమో షూట్ లో నుండి వారి లుక్ రివీల్ చేస్తూ విజయ్ సేతుపతితో కలిసి పనిచేసినందుకు తన ఆనందాన్ని పంచుకుంటూ తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్స్ షేర్ చేశారు. ఇక గతంలో, వీరిద్దరూ ధర్మదురైలో(తెలుగులో ధర్మరాజు) జతకట్టారు. ఇక జంటగా కాకున్నా వారు సైరాలో కూడా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X