Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సోనూ కమర్షియల్, వికలాంగుల ఈవెంట్ కి డబ్బిస్తేనే వస్తానన్నాడు: ఇవాళ దేవుడు..పాత సీక్రెట్ బయటపెట్టిన తమ్మారెడ్డి
సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. ఇండియాని కరోనా కబళిస్తున్న వేళ తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళుతున్నాడు. సహాయం కోరడం ఆలస్యం తానున్నానని క్షణాల్లో వాలిపోతూ సేవ చేస్తున్నారు. అయితే ఆయన గురించి తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

తమిళ సినిమాతో
ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు అయితే ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కాయి. 1999లో విడుదలైన తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత తమిళంలో మరో సినిమా చేసినా గుర్తింపు దక్కలేదు.

హ్యండ్సప్ అంటూ
ఇక తర్వాత సంవత్సరం తెలుగులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో సోనూసూద్ నటించినా ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు . తెలుగు, తమిళ సినిమాలు అలాగే హిందీ సినిమాలు ఇలా వేటినీ వదలకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు సోనూసూద్.

సూపర్ మొదలు
2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ అయిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో సోనూసూద్ కు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు.

తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే ఇప్పుడు రియల్ హీరోగా మారిన సోనూసూద్ పై సూద్ తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోనూ సూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు అంటూనే నాలుగైదేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన గురించి తమ్మారెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

డబ్బులు ఇస్తే వస్తానన్నాడు
ఆ సమయంలో సోనూసూద్ ఎంత కమర్షియల్ గా వ్యవహరించేవాడోనాన్న ఆయన నాలుగు సంవత్సరాల క్రితం వికలాంగుల ఛారిటీ కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం రమ్మని అడిగితే ఆ సమయంలో డబ్బులు ఇస్తే వస్తానన్నాడని అన్నారు.

ఇంత కమర్షియల్ మనిషా
అప్పుడు సోనూ ఇంత కమర్షియల్ మనిషా అనుకున్నానని కానీ ఇప్పుడు సోనూసూద్ దేవుడులా కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని మీద జనం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆయన ఇలాంటి సేవ చేయడానికి అప్పట్లో డబ్బు సంపాదించి ఉండచ్చని కామెంట్స్ చేస్తున్నారు.