Don't Miss!
- News
NBK Vs PSPK : బాలయ్య -పవన్ షో స్ట్రీమింగ్ ముహూర్తం ఫిక్స్: ఇక అన్ స్టాపబుల్..!!
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Technology
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
శరవేగంగా దేవినేని బయోపిక్.. బెజవాడలో మళ్లీ ఆ స్ఫూర్తి రగులుతుందా?
ప్రముఖ
రాజకీయ
నాయకుడు
దేవినేని
నెహ్రు
జీవిత
చరిత్ర
ఆధారంగా
తెరకెక్కుతున్న
చిత్రం
'దేవినేని'.
'బెజవాడ
సింహం'
అన్నది
ఉపశీర్షిక.
నందమూరి
తారకరత్న
టైటిల్
రోల్‌లో
నటిస్తుండగా
నర్రా
శివ
నాగేశ్వరరావు
దర్శకత్వం
వహిస్తున్నారు.
ఆర్‌టిఆర్
ఫిలింస్
పతాకంపై
రాము
రాథోడ్
ఈ
సినిమాను
నిర్మిస్తున్నారు.
బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరం తో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు.. షూటింగ్ షేరవేగంగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ వంగవీటి రంగా పాత్రలో ప్రముఖ వ్యక్తి నటించనున్నారు.. వంగవిటి రాధ పాత్రతో బెనర్జీ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ అద్భుతమైన నటన కనపరిచారు. వెంకటరత్నం మళ్లీ పుట్టారా అనిపించేలా ఆయన నటన కొనసాగింది. నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూ లో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించడం మరో విశేషం అన్నారు.
నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. 1977 దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ లో జై ఆంధ్ర యా స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ చిత్రంలో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. అందరూ నటీనటులు చాలా బాగా నటించారు అని అన్నారు.
నటీనటులు: నందమూరి తారక రత్న, బెనర్జీ, తుమ్మల ప్రసన్న కుమార్, నాగినీడు, పృధ్వి, అజయ్, MNR చౌదరి, అన్నపూర్ణమ్మ, శివారెడ్డి, తేజ రాథోడ్ తదితరులు..
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు
నిర్మాత: రామ్ రాథోడ్
బ్యానర్: ఆర్‌టిఆర్ ఫిలింస్