twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానికి సారీ.. మా ఉద్దేశం అది కాదు.. అంతా ఒక ఫామిలీనే కానీ!

    |

    కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతుండటం.. టికెట్ ప్రైస్ తక్కువగా ఉండటం లాంటి విషయాలు హీరోలు, దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలో దాదాపు అంతా లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితి మెరుగు పడే దాకా వరకు పెద్ద సినిమాలు వెయిట్ చేయక తప్పదు. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఓటీటీ రిలీజ్ సినిమాలు పోటీ రావడంపై ఎగ్జిబిటర్లు కొందరు నిన్న ఫైర్ అయ్యారు. అయితే అది శ్రుతి మించి నాని సినిమాలు బ్యాన్ చేయమనే దాకా వెళ్ళింది. ఇప్పుడు వెనక్కు తగ్గి క్షనాపమలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాల్లోకి వెళితే.

     అసలు వివాదం ఏంటంటే

    అసలు వివాదం ఏంటంటే

    సునీల్ నారంగ్ నిర్మించిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే దీనికి పోటీగా నాని టక్ జగదీష్ ఓటీటీలో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో తనకు మద్దతుగా ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టి మరి టక్ జగదీష్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాలని అన్నారు నిర్మాత సునీల్ నారంగ్. లవ్ స్టోరీ వర్సెస్ టక్ జగదీష్ పోటీ కాస్త థియేట్రికల్ వర్సెస్ ఓటీటీ అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. నిజానికి నిర్మాతలకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి సినిమాను ఓటీటీ రిలీజ్ చేసినా తమకు సమ్మతమే అని.. కాని ముందు అనుకున్న సినిమా రిలీజ్ డేట్ న ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని సునీల్ నారంగ్ వాదించారు. అంతేకాదు ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు పండుగ టైం ను వదిలి పెట్టాలని కూడా డిమాండ్ చేశారు.

    ఆగ్రహం వ్యక్తం చేస్తూ

    ఆగ్రహం వ్యక్తం చేస్తూ

    అంతే కాక నాని తన సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమా నిర్మాతలతో పాటు నానీని కూడా ఈ విషయంలో తప్పుబట్టారు. నిన్న జరిగిన తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం హీరో నానిపై విమర్శలు గుప్పించారు. ఈ సంధర్భంగా.. నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని, నిజ జీవితంలో పిరికివాడు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హీరో నానితో పాటు.. సినిమా నిర్మాతలు, యూనిట్ పై విమర్శలు చేస్తున్న థియేటర్ ఓనర్స్ మీద ఇండస్ట్రీ నుంచే కాక సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఎదురుదాడి మొదలైంది. నిర్మాతలు రిలీజ్ చేసుకుంటామని అంటే నానిని టార్గెట్ చేయడం ఏంటి ? అదీ కాక అదే రోజు మ్యాస్ట్రో సినిమా రిలీజ్ అవుతుంటే ఆ హీరోను టార్గెట్ చేయకుండా ఈయనని టార్గెట్ చేయడం ఏంటి అనే విమర్శలు వినిపించాయి.

     క్షమాపణలు చెబుతూ

    క్షమాపణలు చెబుతూ

    దీంతో ఎట్టకేలకు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానీకి, టక్ జగదీష్ చిత్రయూనిట్‌కి క్షమాపణలు చెబుతూ కొద్ది సేపటి క్రితం లేఖను విడుదల చేసింది. ట్రేడ్ మెరుగుదల కోసం మరియు వాణిజ్యంలో ప్రతిఒక్కరికీ ఉత్తమమైన మరియు ప్రయోజనకరమైన పద్ధతులను అనుసరించడం కోసం 2021 ఆగస్టు 20 న తెలంగాణ ఎగ్జిబిటర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారని సంబంధిత తెలుగు ఫిల్మ్ ట్రేడ్ సంబంధిత ప్రజలందరికీ తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. మా సెక్రటరీ చాలా రోజులు మాత్రమే సినిమాను వాయిదా వేయాలని లేదా కొన్ని రోజులు మాత్రమే వాయిదా వేయమని అభ్యర్థించారు, మేము వ్యాపారంలో ఎవరికీ వ్యతిరేకం కాదు మరియు వ్యాపారంలో అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని మేము నమ్ముతాము అలాగే అంగీకరిస్తామని అన్నారు. చాలా కాలం పాటు థియేటర్లు మూతపడ్డాయి మరియు కొంతమంది ఎగ్జిబిటర్‌లు టక్ జగదీష్ సినిమాపై చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారని అన్నారు.

    ఎవరికీ వ్యతిరేకం కాదు

    ఎవరికీ వ్యతిరేకం కాదు

    అందుకే ఆ సినిమా OTT విడుదలను ఎంచుకున్నట్లు తెలిస్తే, వారిలో కొందరు వ్యక్తిగత బాధతో మాట్లాడారు. కేవలం వేదనతో మాట్లాడారని అంతే కానీ ఇది వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మా ఎగ్జిబిటర్లలో కొంతమంది ఎవరినైనా బాధపెడితే మేము ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని, వ్యాపారంలో మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారమనే వాస్తవాన్ని మేము మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు. మేము వాణిజ్యం అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తున్నాము తప్ప ఎవరికీ వ్యతిరేకంగా కాదని అందులో పేర్కొన్నారు.

    Recommended Video

    #Telangana : Devishree Guruji Distributing Grocery For Poor People During Lockdown
     'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

    'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

    అసలు ఇంత వివాదానికి కారణం ఏంటంటే 'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని థియేటర్లకు మద్దతుగా చెప్పిన మాటలు.. 'టక్ జగదీష్' కు ఓటీటీ నుంచి ఎక్కువ ధర రాబట్టు కోవడానికే అని నిన్న జరిగిన మీటింగ్ లో ఓ ఎగ్జిబిటర్ ఆరోపణలు చేశారు. ఆ ఊపు తెప్పించే స్పీచ్ వల్ల నాని తన చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో అని అలా ఓటీటీ వాళ్ళు మరో రూ. 4 కోట్లు ఇచ్చారు అని అన్నారు. అంతే కాక నాని సినిమాల్లోనే హీరో అని బయట పిరికి వాడంటూ చెప్పుకొచ్చారు.

    English summary
    Telangana exhibitors have released a press note stating that some of their comments haven’t been targeted at anyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X