twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీకి అమ్మొద్దు.. అమ్మితే ఏం చేయాలో అది చేస్తాం.. నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ వార్నింగ్!

    |

    కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూసివేసి ఉండడంతో ఇప్పుడు ఓటీటీల వంక చూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విజ్ఞప్తి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    మళ్ళీ విజ్ఞప్తి

    మళ్ళీ విజ్ఞప్తి


    బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించగా అందులో కొందరు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కోరినట్టుగా అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు అమ్మొద్దని మళ్ళీ విజ్ఞప్తి చేసింది.

     రిక్వెస్ట్‌ చేస్తున్నాం

    రిక్వెస్ట్‌ చేస్తున్నాం

    ముందుగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలందరూ తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్‌ చేస్తున్నామని, ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలు ఎవరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండని అన్నారు.

    ఆగస్ట్‌ మొదటి వారంలో

    ఆగస్ట్‌ మొదటి వారంలో

    ఇక ఛాంబర్ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ ఆగస్ట్‌ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోందని అన్నారు. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు కానీ పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా? అని ప్రశ్నించారు. అక్టోబర్‌ 30 వరకైనా ఆపుకోవాలని అన్నారు. తను కూడా సినిమాలు తీస్తున్నానన్న ఆయన నిర్మాత బాధలు తెలుసని అన్నారు.

     ఏం చేయాలో అది చేస్తామ్

    ఏం చేయాలో అది చేస్తామ్

    అయితే నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎక్కువ బాధలు పడుతున్నారు కాబట్టి ఓటీటీకి సినిమాలు ఇవ్వకండని కోరారు. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోవచ్చని అన్నారు. మా 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చినా ఓటీటీలకు ఇవ్వలేదని అన్నారు. ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. 'ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నామని అన్నారు. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళితే.. మేం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.

    Recommended Video

    #Telangana : Devishree Guruji Distributing Grocery For Poor People During Lockdown
    ఇంతకు ముందు కూడా

    ఇంతకు ముందు కూడా

    ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టామన్న ఆయన అది వారికి తెలియడం లేదని అన్నారు. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నామని అన్నారు. భవిష్యత్ అంతా థియేటర్లదేనన్న ఆయన ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయి అని అన్నారు. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకు సినిమా ఏం అర్థమవుతుందని అన్నారు. అందుకే ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుందని అన్నారు.

    English summary
    Telangana film chamber of commerce called for a Pressmeet today and warned such producers of dire consequences if they do not wait until theaters open.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X