Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అతనిపై ఎక్కేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రచ్చ.. పాపం అంటున్న జనాలు.. వీడియో వైరల్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో ప్రగతి టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఎక్కువగానే స్టార్ హీరోలకు తల్లి పాత్రలలోనే నటించారు. ఎమోషనల్ అలాగే ఫన్నీ క్యారెక్టర్స్ లో కూడా కనిపించిన ప్రగతి బాహ్య ప్రపంచంలో మాత్రం చాలా సరదాగా ఉంటారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

ఎమోషనల్, ఫన్నీ
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి నటిగా గుర్తింపునందుకున్న ప్రగతి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి కూడా తల్లి పాత్రలలో నటించారు. ముఖ్యంగా చిరుత సినిమాలోని చేసిన ఎమోషనల్ క్యారెక్టర్ కు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా F2, F3 సినిమాలలో కూడా ఆమె గడసరి అత్తగా నవ్వించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఏమాత్రం సంబంధం ఉండదు
అయితే సినిమాలో విషయం పక్కన పెడితే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎనర్జీతో కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా ఆమె వయసుకు అలాగే ఆమె చేసే వర్కౌట్స్ కు కూడా ఏమాత్రం సంబంధం ఉండదు అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లామర్ తో కూడా ప్రగతి ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు 18 ఏళ్ల కూతురు ఉన్నప్పటికీ కూడా చాలా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.

ఈ వయసులో కూడా అదే ఎనర్జీ
ప్రగతి సోషల్ మీడియాలో తరచుగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా బరువైన వాటితో ఆమె వర్కవుట్ చేసే విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రగతిని చూస్తే ఎవరైనా సరే మూడుపదుల వయసు దాటిందేమో అనుకుంటారు. కానీ వయసు ప్రస్తుతం 46 లోకి వచ్చేసింది. ఒక విధంగా ఈ నెంబర్ ను నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.
బ్యాండ్ పై డ్యాన్స్
అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన మరొక వీడియో కూడా వైరల్ గా మారింది. ఆమె ఏకంగా బ్యాండ్ కొట్టే వ్యక్తిపై భారం పడేవిధంగా కూర్చొని డాన్స్ చేసింది. ఆ బ్యాండ్ పై కూర్చున్న విధానం అలాగే ఆమె చాలా ఉల్లాసంగా డాన్స్ చేస్తున్నట్లు కనిపించిన విధానం ఒక విధంగా నెటిజన్స్ ను ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.

సిస్టర్ పెళ్లి వేడుకలో..
అతను బ్యాండ్ కొడుతూ ఉంటే ప్రగతి చాలా ఎనర్జీతో కనిపించింది. మా సిస్టర్ పెళ్లి వేడుకలో అసలు కామ్ గా ఉండలేను.. అని కూడా ఆమె క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ బరువు మోస్తున్న వ్యక్తి పాపం అంటూ నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రగతి మాత్రం ఎప్పుడు చూసినా చాలా హైప్ తో కనిపిస్తుంది అని మరోసారి రుజువు చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో ఐదు సినిమాలు చేస్తున్న ఆమె తమిళంలో కూడా రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.