twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు కూడా న్యాయం చేయండి.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుగు నిర్మాతల మండలి వినతి!

    |

    ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాల్లోను ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను టాలీవుడ్ నిర్మాతల మండలి వినతి పాత్రలను అందజేసింది. మొదట్లో కనీసం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

    కానీ ఇప్పుడు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తోందని అందుకే 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కోలీవుడ్ ఇండస్ట్రీకి 100శాతం సీటింగ్ సామర్ధ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని ఇండస్ట్రీలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    Telugu film producer council special request to two States governments

    కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తెలుగు నిర్మాతల మండలి కోరింది. లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు, గౌరవ మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూడా వారు తెలియజేశారు.

    English summary
    It is learned that the Tamil Nadu government has recently given permission to increase the seating capacity in cinema theaters from 50 per cent to 100 per cent. Also, the Tollywood Producers' Council has requested the AP and Telangana governments to give the roles in the Telugu states
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X