ఫలక్‌నుమా దాస్ 2పై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్.. త్వరలోనే..
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన విశ్వక్ సేన్ అదే తరహాలో విభిన్నంగా వెళుతున్నాడు. చేసే ప్రతి సినిమా కూడా ఎంతో కొంత భిన్నంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ హీరో కెరీర్ కు ఫలక్‌నుమా దాస్ మూవీ కూడా మరింత బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఆ సినిమాను విశ్వక్ సేన్ తనే డైరెక్ట్ చేయగా కరాటే రాజు నిర్మించారు. మలయాళం హిట్ మూవీ అంగమలై డైరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు నెటీవీటికి తగ్గట్లుగానే రూపొందించారు. సినిమాలో కొన్ని సీన్స్ ఓ వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ అదే సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ ను రెడీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.

అసలైతే ఒరిజినల్ మలయాళం కథకు సీక్వెల్ లేదు. కానీ విశ్వక్ సేన్ అదే స్టైల్ లో మరొక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫలక్‌నుమా దాస్ ముహూర్తం షాట్ కు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ముహూర్తం షాట్ నిన్ననే జరిగినట్లు అనిపిస్తోందని మళ్ళీ అదే టీమ్ తో ఫలక్‌నుమా దాస్ 2తో సిద్ధం కానున్నట్లు వివరణ ఇచ్చాడు.
ఇక ఈసారి విశ్వక్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి మరి. మరోవైపు పాగల్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని విశ్వక్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











