OTT Releases in June: సందడి చేయనున్న సమంత, ధనుష్.. రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఏమిటంటే!
గత ఏడాది టాలీవుడ్ కరోనా కారణంగా చాలా నష్టపోయింది. మార్చి నెల 23వ తేదీ నుంచి దేశం అంతా లాక్ డౌన్ లోకి వెళ్లడంతో దాదాపు ఐదారు నెలల పాటు థియేటర్లు ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో సినిమా నిర్మాతలను కాస్త ఆదుకున్న వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ఓటిటి అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ ఏడాది కూడా దాదాపు గత ఏడాది ఉన్న పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతోంది.
ఇప్పటికే పూర్తిస్థాయిలో థియేటర్లు మూసివేత కొనసాగుతుండగా మళ్ళీ ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సినిమా వాళ్ళు చాలా కీలకంగా భావించే సమ్మర్ సీజన్ అయిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ వేదికగా రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

ది ఫ్యామిలీ మ్యాన్ 2
జూన్ 4న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ ఒటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది. మొదటి సిరీస్ సూపర్ హిట్ కావడం సెకండ్ సీజన్ మీద కూడా మంచి అంచనలు ఉన్నాయి.

'కాలా' విత్ కంజ్యూరింగ్
ఇక అదే జూన్ 4న తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'లో టోవినో థామస్ హీరోగా నటించిన 'కాలా' అనే మలయాళ సినిమా అదే పేరుతో తెలుగులోకి స్ట్రీమ్ కానుంది. ఇది మాత్రమే కాక హాలీవుడ్ సినిమా ది కంజురింగ్ 3 థియేట్రికల్ గానే కాక డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.

అర్ధ శతాబ్దం - రంగ్ దే
ఇక సాయి కుమార్ -కార్తీక్ రత్నం - నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన 'అర్ధ శతాబ్దం' సినిమా జూన్ 11న ఆహాలో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. ఇక నితిన్ హీరోగా ఇటీవల రిలీజ్ అయిన రంగ్ దే సినిమా జూన్ 12 నుంచి జీ 5 యాప్ లో ప్రసారం అవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కట్లా వెబ్ సిరీస్ మొదటి సీజన్ జూన్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
Recommended Video

ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్
ఇక జూన్ 18న తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 'జగమే తంత్రం' సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. అదే రోజున ప్రియదర్శి - నందినీ రాయ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జూన్ 25న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేసి 'ఆహా' లో స్ట్రీమింగ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











