For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కారు యాక్సిడెంట్ అలా.. జీవితం అంతా మారిపోయింది.. గట్టు విప్పిన రాజ్ తరుణ్!

  |

  షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీతో హీరోగా మారాడు. చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆయన. నిజానికి ఆ ఒక్క సినిమాతోనే కాక కెరీర్ మొదట్లో వరుస సక్సెస్ లు అందుకున్న ఈ హీరో ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నా కానీ ఒక్క హిట్ కూడా కొట్టలేక పోతున్నాడు. అయితే అసలు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు తన జీవితంలో జరిగిన యాక్సిడెంట్ తనను పూర్తిగా మార్చేసింది అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

   సీసీటీవీ ఫుటేజ్ లను బట్టి

  సీసీటీవీ ఫుటేజ్ లను బట్టి

  కెరీర్ మొదట్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందుకున్న రాజ్ తరుణ్ కెరియర్ గత మూడు నాలుగేళ్లుగా స్లంప్ లో ఉంది. సరైన హిట్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆయన సరిగ్గా రెండేళ్ల క్రితం హైదరాబాద్ శివారు అల్కాపురి టౌన్ షిప్ వద్ద కారు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే ఆయన కారు వదిలి పారిపోయిన విజువల్స్ సీసీటీవీలో బయటకు రావడంతో పెద్ద రచ్చ జరిగింది.

  పెద్ద ఎత్తున ప్రచారం

  పెద్ద ఎత్తున ప్రచారం

  ఈ వీడియో ఫుటేజ్ పలు చానళ్లకు దక్కడంతో ఇంకేముంది ఏదో జరిగిపోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోయింది. వేగంగా డివైడర్ను ఢీకొట్టిన కారు మూడు పల్టీలు కొట్టిన తరువాత రోడ్డు పక్కన ఉన్న ఒక గోడకు గుద్దుకుని ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళి ఆగింది. అయితే అది లగ్జరీ కారు కావడంతో రాజ్ తరుణ్ కు గాయాలు కాలేదు. దీంతో వెంటనే కారులోంచి దిగిన ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దగ్గర్లోనే ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు.

  బ్లాక్ మెయిల్

  బ్లాక్ మెయిల్

  ఆ తర్వాత రంగంలోకి దిగిన కార్తీక్ అనే వ్యక్తి కారు ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు అని తాను వెంబడించి పట్టుకున్నారు అని మీడియా ముందుకెక్కాడు. అయితే ఆయన డబ్బు డిమాండ్ చేశాడు అని రాజ్ తరుణ్ వర్గీయులు ఆరోపించగా లేదు రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర వీడియో ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పాడని సదరు కార్తీక్ అనే వ్యక్తి ఆరోపణలు చేసి పెద్ద రచ్చ చేశాడు.

  ఏం జరుగుతుందో అర్థం కాలేదు

  ఏం జరుగుతుందో అర్థం కాలేదు

  చాన్నాళ్ల తర్వాత ఈ అంశం మీద రాజ్ తరుణ్ నోరు విప్పాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ యాక్సిడెంట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తనను యాక్సిడెంట్ బాగా డిస్టర్బ్ చేసిందని యాక్సిడెంట్ దెబ్బకు తనకు వైరల్ ఫీవర్ లాంటిది కూడా వచ్చేసింది అని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ జరగడంతో అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని అందుకే దిగి దగ్గర్లో ఉన్న తన ఇంటికి పరుగెత్తుకు వెళ్ళానని చెప్పుకొచ్చాడు.

  అందుకే లైట్ తీసుకున్నా

  అందుకే లైట్ తీసుకున్నా

  పొద్దున లేచి చూసేసరికి మీడియా మొత్తం రచ్చరచ్చ జరిగిందని, అంత జరిగాక తను ఆ విషయం గురించి ఆలోచించ కూడదని భావించానని అందుకే రాజా రవీంద్రకు కూడా ఈ విషయం గురించి పెద్దగా డిస్కస్ చేయ వద్దు అని చెప్పేశానని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తన జీవితాన్ని మొత్తాన్ని మార్చేసిందని పేర్కొన్న ఆయన జీవితంలో ఇక డ్రైవింగ్ జోలికి కూడా వెళ్లనని చెప్పుకొచ్చాడు. అంతేకాక డబ్బు డిమాండ్ చేసిన సదరు కార్తీక్ అనే వ్యక్తిని కూడా ఆయన వెనకేసుకొచ్చారు. అతనికి ఏం అవసరాలు ఉన్నాయో అలా డిమాండ్ చేసి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు.

  English summary
  Tollywood actor Raj Tarun was involved in a car accident two actors back. he ran away from the spot before the police officials could arrive. in his recent interview he opened up about accident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X