Ram Gopal Varma బాబాగా మారితే.. ఆర్జీవిపై మరో సెటైరికల్ మూవీ

సినిమా ఇండస్ట్రీలో అపర మేధావిగా, సంచలనాలకు మారుపేరుగా రాంగోపాల్ వర్మ అందరికి సుపరిచితులు. సెటైర్లు వేయడంలోను, అలాగే వివాదాస్పద అంశాలపై కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే ఇటీవల కాలంలో ఆర్జీవి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని చెప్పడంలో కొత్తేమీ లేదు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంపై, ప్రొఫెషనల్ జీవితంపై ఎందరో తమకు నచ్చిన విధంగా సినిమాలు రూపొందించి సైటర్లు వేశారు. అయితే తాజాగా ఆర్జీవిని టార్గెట్ చేసుకొని వస్తున్న మరో చిత్రం The Boss - Never Dies ("ది బాస్ (నెవర్ డైస్). ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై యువ కమెడియన్ షకలక శంకర్ హీరోగా యువ నిర్మాత బొమ్మకు మురళి ది బాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాంగోపాల్ వర్మ లాంటి ప్రముఖుడు బాబాగా మారితే ఎలా ఉంటుందనే ఊహాజనిత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యువ దర్శకుడు ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ది బాస్-నెవర్ డైస్ అత్యంత వివాదాస్పద అంశాలతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను ప్రముఖ హాస్య నటుడు సునీల్ ఆవిష్కరించారు.

 The Boss: Never Dies satirical movie on Ram Gopal Varma

ది బాస్, నెవర్ డైస్ చిత్రం సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుంది. రామ్ గోపాల్ వర్మ పాత్రలో షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడు. అని సునీల్ అభిప్రాయపడ్డారు.

 The Boss: Never Dies satirical movie on Ram Gopal Varma

ఈ సందర్భంగా నిర్మాత బొమ్మకు మురళీ మాట్లాడుతూ.. ది బాస్ నెవర్ డైస్ టైటిల్ లోగో నటుడు సునీల్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది., ఈ సినిమా షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్నది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

నటీనటులు: డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ తదితరులు
కథ-నిర్మాత: బొమ్మకు మురళి
దర్శకత్వం: ఈశ్వర్ బాబు ధూళిపూడి!
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్: హిమాన్షు
డైలాగ్స్: బాద్షా హెచ్.కె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ
బ్యానర్: బొమ్మకు క్రియేషన్స్
సమర్పణ: హిమమాల బొమ్మకు
పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X