The family man 2: నటీనటుల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. సమంతకు ఎంత ఇచ్చారో తెలుసా?
ఈ ఏడాది ఆమెజాన్ ప్రైమ్ లో అత్యదిక స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నిలిచింది. ఇండియన్ వెబ్ సిరీస్ ల హవా తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో మరోసారి రాజ్ అండ్ డీకే క్రియేట్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఇందులో నటించిన వారికి ఇచ్చిన రెమ్యునరేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అందరికి ఎంత ఇచ్చారనే విషయంలోకి వెళితే..

కంటెంట్ సాలీడ్ గా ఉంటే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వెబ్ కంటెంట్స్ కు భవిష్యత్తులో మరింత క్రేజ్ అందుతుందని కొందరు బాగానే పసిగట్టారు. అందులో రాజ్ అండ్ డీకే దర్శకుద్వయం కూడా ఉంది. కంటెంట్ సాలీడ్ గా ఉంటే అటు వైపు కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంటుందని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, 2లతో కూడా ఓటీటీ మార్కెట్ వాల్యూ మరింత పెరిగింది.

డిజిటల్ వరల్డ్ లో కూడా కోట్ల ఆదాయం
థియేటర్స్ లోనే కాకుండా డిజిటల్ వరల్డ్ లో కూడా కోట్ల ఆదాయాన్ని అందుకోవచ్చని నిరూపించారు. ఇక ఈ దారుల్లో రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది అందరిలోను కొంత అనుమానాలను కలిగిస్తున్నాయి. నిజానికి సినిమాలకు కంటే కూడా కొన్ని ఓటీటీ ప్రాజెక్టులకు మంచి పేమెంట్స్ అందుతున్నాయని చెప్పవచ్చు.

అందరికంటే ఎక్కువగా..
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన నటీనటులుకు సంబంధించిన పారితోషికాలపై కూడా ఒక లుక్కేస్తే.. సమంత కంటే కూడా మనోజ్ బాజ్‌పాయ్ కు ఎక్కువ జీతం అందినట్లు సమాచారం. మొత్తం ఎపిసోడ్స్ కోసం కూడా మనోజ్ బాజ్‌పాయ్ రూ.10కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆయన శ్రీకాంత్ తివారి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక సమంత ఈ వెబ్ సిరీస్ లో రాజలక్ష్మి చంద్రన్ అలియాజ్ రాజీ అనే పాత్రలో నటించింది. తమిలియన్స్ LTTE బ్యాక్ డ్రాప్ లోనే ఆమె పాత్రను రూపొందించారని అనేక రకాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సమంత పాత్ర కాంట్రవర్సీతోనే సగం బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సమంత 3 నుంచి 4 కోట్ల మధ్యలో తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

మిగతా వారి రెమ్యునరేషన్స్..
ఇక మిగతా వారి రెమ్యునరేషన్ లిస్టులోకి వెళితే.. సీజన్ 2 కోసం ప్రియమణి (సుచిత్రా తివారి) - 80 లక్షలు ఇచ్చారట. షరీబ్ హష్మి ( జేకే తల్పడే) - 65 లక్షలు, దర్శన్ కుమార్ (మేజర్ సమీర్) - 1కోటి, ఆశ్లేషా ఠాకూర్ (ద్రితి తివారి) - 50లక్షలు, శరద్ కేల్కర్ (అరవింద్) - 1.6కోట్లు, సన్నీ హిందూజా (మిలింద్) - 60 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











