కేసులు ఇవ్వండి ప్లీజ్ అంటున్న సందీప్ కిషన్: తెనాలి రామకృష్ణ’ ఫస్ట్ లుక్
సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్... కేసులు ఇవ్వండి ప్లీజ్ అనేది ట్యాగ్ లైన్. హీరో పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మిస్తున్నారు.
హీరో సందీప్ కిషన్ సరసన తొలిసారిగా అందాల భామ హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు.

డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రారంబోత్సవం జరుపుకోగా.. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా మే 7 నుంచి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుందని, కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంలో సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెలకిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: గ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్
సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
కథ: టి.రాజసిహ
మ్యూజిక్: రాజసింహ
సంగీతం: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరాం
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్


Click it and Unblock the Notifications











