twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The warrior movie Pre Release Event: మీరు లేకపోతే నేను లేను.. ఇది నాకు ఎమోషనల్ ఫిల్మ్: రామ్

    |

    యువర్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని నుంచి ది వారియట్ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రెండు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. తప్పకుండా ఈ సినిమాతో రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ పోతినేని తన పవర్ఫుల్ స్పీచ్ తో ఆదరగొట్టేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    కథ వినగానే ట్వీట్ చేశా

    కథ వినగానే ట్వీట్ చేశా

    రామ్ పోతినేని మాట్లాడుతూ.. మొదట నేను పోలీస్ కథలు చేయాలని అనుకున్నప్పుడు రెండు మూడు కథలు కూడా విన్నాను. అయితే అవన్నీ కూడా ఒకే తరహాలో అనిపించడంతో ఏదైనా డిఫరెంట్ కంటెంట్ లో ట్రై చేద్దామని ఆలోచన వచ్చింది. అప్పుడే డైరెక్టర్ లింగు స్వామి గారు వచ్చి నాకు ఈ కథ చెప్పడం జరిగింది కదా వినగానే చాలా అద్భుతంగా అనిపించి వెంటనే ట్విట్ చేశాను.. అని అన్నారు.

    అందుకే కథ ఓకే చేశాను

    అందుకే కథ ఓకే చేశాను

    దర్శకుడు ఈ కథను కొన్ని నిజ జీవితంలోనే సంఘటన ఆధారంగా తీసుకోవడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. సమాజంలో ఎంతో మంది సత్య అనే క్యారెక్టర్ తరహాలో చాలా నిజాయితీగా ధైర్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హాట్సాఫ్ చెప్పాలి. లైఫ్ లో వీళ్ళందరి స్టోరీలు విన్న తర్వాత జీవితంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు అనిపించింది. అందుకే ఈ కథ చేయడానికి ముందుకు వచ్చాను.. అని రామ్ అన్నారు.

    గాయం కారణంగా

    గాయం కారణంగా

    ఇది నాకు చాలా ఎమోషనల్ ఫిలిమ్. ఈ సినిమా క్యారెక్టర్ కోసం జిమ్ లో వర్కౌట్స్ చేసినప్పుడు ఒకసారి గాయం అయ్యింది. అప్పుడు మూడు నెలల వరకు కూడా అదే నొప్పితో ఉన్నాను. ఇక డాక్టర్ ను అడగడంతో అప్పుడే ఆయన ఒక ప్రశ్న వేశారు. మీకు సినిమా ముఖ్యమా లైఫ్ ముఖ్యమా అని అడిగారు. కానీ సినిమాని జీవితం అనుకునే వాళ్ళకి అది కొంచెం కష్టమైన ప్రశ్న అనిపిస్తుంది.. అని రామ్ చెప్పారు.

    మీరు లేకపోతే నేను లేను

    మీరు లేకపోతే నేను లేను

    ఒక వారం తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేసి చూసేసరికి అభిమానుల నుంచి చాలా ప్రేమ నాకు దక్కింది. అన్నా ఈ సినిమా కోసం నువ్వు పెద్దగా ఏమీ చేయకపోయినా కూడా మేము ఈ సినిమాను చూస్తామని అన్నారు. అప్పుడు నాకు అన్ కండీషనల్ లవ్ అనిపించింది. ఆ క్షణం నాకు అర్థమైంది మీరు లేకపోతే నేను లేను అని. అంత నొప్పితో ఉన్నా కూడా నేను చేయగలను అని చాలామంది అన్నారు. కానీ నాకు ప్రతి ఎనర్జీ కూడా మీ నుంచి వచ్చింది. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అని రామ్ తెలియజేశారు.

    అందరికి నచ్చే సినిమా

    అందరికి నచ్చే సినిమా

    తప్పకుండా ది వారియర్ సినిమా మీకు నచ్చుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన అభిమానులందరికి కూడా ప్రత్యేకంగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఈనెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి అని ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు కూడా చాలా థాంక్స్ చెబుతున్నట్లు రామ్ పోతినేని తన స్పీచ్ ముగించారు.

    English summary
    The warrior movie pre release event Ram pothineni powerful speech..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X