For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'అబ్బా తియ్యగుంది' వివాదంలో తిమ్మరుసు మూవీ.. వదలమంటూ టీడీపీ ఫాన్స్ వార్నింగ్!

  |

  కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, ఆడపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకుని దానిని బేస్ చేసుకుని విమర్శించడం ఎక్కువైపోతోంది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న తిమ్మరసు మూవీ కూడా దాదాపు అలాంటి ఒక వివాదంలో చిక్కుకుంది.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  సూపర్ హిట్ టాక్

  సూపర్ హిట్ టాక్


  విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడి దర్శకత్వంలో తిమ్మరుసు అనే మూవీ తెరకెక్కింది సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత హైప్ తో థియేటర్లలో రిలీజ్ అయింది. జూలై 30వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది.. అయితే ఈ సినిమాలో ఒక సీన్ మాత్రం ఇప్పుడు వివాదాస్పద అంశం అవుతోంది.. ఏకంగా రాజకీయాల్లో ఈ సీన్ ను లాగడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.

  ఎన్టీఆర్ పీఆర్వో కావటంతో

  ఎన్టీఆర్ పీఆర్వో కావటంతో

  నిజానికి ఈ సినిమాను నిర్మించింది మహేష్ ఎస్ కోనేరు.. ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి అధికారికంగా పి ఆర్ ఓ గా విధులు నిర్వహించేవారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారో లేదో తెలియదు గాని గత కొద్ది రోజులుగా ఆయన నిర్మాతగా అవతారం ఎత్తారు. కళ్యాణ్ రామ్ తో 118 సినిమా మొదలు అనేక సినిమాలు నిర్మించిన ఆయన ఈ సినిమాని కూడా నిర్మించారు.. ఆయన ఈ సినిమా నిర్మాత కావడమే ఈ వివాదాస్పద అంశానికి మరింత ఆజ్యం పోసినట్లయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  లోకేష్ కోసం ఎన్టీఆర్ ను అలా

  లోకేష్ కోసం ఎన్టీఆర్ ను అలా

  నిజానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు.. ఆయన తర్వాత పార్టీని ఆయన తనయుడు లోకేష్ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది.. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ మధ్య పోటీ అనే వ్యవహారం ఇప్పటిది కాదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ కి ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను రాజకీయాలలో యాక్టివ్ గా ఉందనివ్వడం లేదు అని టిడిపిలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటికప్పుడు సైలెన్స్ పాటిస్తూ వస్తున్నారు.

  అబ్బా తియ్యగుంది

  అబ్బా తియ్యగుంది

  అయితే తాజాగా తిమ్మరుసు సినిమాలో లోకేష్ ను ట్రోల్ చేశారని టీడీపీ వారు విమర్శిస్తున్నారు. కావాలనే మహేష్ కోనేరు ఈ సినిమాలో అలా చేయించారని ఎన్టీఆర్ మెప్పు పొందేందుకు ఈ మేరకు చేయించారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నుంచి లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ప్రచారం జరుగుతూ ఉండగా ఒక మహిళ మహిళ లోకేష్ కు మజ్జిగ ఇవ్వగా అది తాగిన లోకేష్ ఏం కలిపావు అమ్మ తియ్యగా ఉంది అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

  Recommended Video

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  లోకేష్ ను తక్కువ చేయాలనే

  లోకేష్ ను తక్కువ చేయాలనే


  అయితే దానిని ట్రోల్ చేసే విధంగానే ఇప్పుడు బ్రహ్మాజీ చేత కొబ్బరి నీళ్ళు తాగించి ఆ తర్వాత అబ్బా తియ్యగా ఉంది అంటూ అనిపించారు అని అంటున్నారు. ఆ తర్వాత సినిమాలో ఒక పేపర్ యాడ్ చూసి అందులో ఎన్టీఆర్ ని చూసి మన ఎన్టీఆర్ రా అంటూ బ్రహ్మాజీ చేత మరో డైలాగ్ చెప్పించారు అని అంటున్నారు. కావాలని లోకేష్ ను తగ్గించి ఎన్టీఆర్ ను టైప్ చేసే విధంగా మహేష్ చేసుకొని ఈ సినిమాను రూపొందించారు అని విమర్శిస్తున్నారు. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటామ్ ఇలా వేషాలు వేస్తే మేము ఏంటో చూపిస్తామని అంటూ టిడిపికి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో పెద్దఎత్తున కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. మరి దీని మీద తిమ్మరుసు యూనిట్ ఏమైనా స్పందిస్తుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.

  English summary
  as we all know thimmarusu movie starred by satya Dev and Priyanka jawalkar hitted theatres on 30th July.. now the movie landed in new controversy about a dialogue remembering Nara Lokesh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X