గౌరవంగా భావిస్తున్నా: ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు వెర్షన్ ట్రైలర్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయించారు.

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' తెలుగు ట్రైలర్ నేను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ టీమ్ పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అని రాజమౌళి ట్వీట్ చేశారు.
అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' నవంబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఫిలిప్ మీడో రచించిన 1839 నాటి ఫిక్షన్ నవల... కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధూమ్ 3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











