twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Ananda Chakrapani: టాలీవుడ్ నాన్న పాత్రల స్పెషలిస్ట్‌గా.. ఎమోషనల్ రోల్స్‌తో..

    |

    ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమ పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఉన్నా మరొకరికి చోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ వచ్చే వారు టాలెంట్ ఉన్న వారైతే తెలుగు పరిశ్రమ కళ్ళకద్దుకుని వారికి వారు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంది.. అలాంటి వారిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగులో క్రారేక్తర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ చక్రపాణి గురించి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆనంద చక్రపాణి ఈ ఏడాది మొత్తం మీద డజను సినిమాల్లో కనిపించబోతున్నారు.

    నిజానికి ఒకప్పుడు గ్లిజరిన్ లేకుండా నటించారు అని మహామహుల గురించి వింటూ ఉంటాం అలాంటి మహామహుల స్థాయిలో నిలబడేలా ఆనంద చక్రపాణి కూడా అది లేకుండానే నటిస్తారు. సాధారణంగా నటన వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో ఆయన ఇప్పటికీ గ్లిజరిన్ లేకుండా ఎన్ని టేక్స్ అయినా చేస్తారట. అంతలా ఎమోషన్స్ పండించడంలో ఆయన దిట్ట.

    ఇక చివరగా ఈ మధ్య కాలంలో విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ల తండ్రిగా నటించిన ఆయన అల్లరి నరేష్ హీరోగా రూపొందిన నాంది సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. ఆహా వేదికగా విడుదలైన అనగనగా ఓ అతిధి లో పాయల్ రాజ్ పుత్ తండ్రి పాత్రలో నటించిన ఆయన పాత్రను ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. ఆ సినిమానే కాదు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాల గురించి చెప్పుకోవాల్సింది మల్లేశం గురించి.

    Tollywood Actor Ananda Chakrapani birthday special

    మల్లేశం సినిమాలో ప్రియదర్శి తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించిన ఆయన ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో కూడా నటించి మెప్పించారు. అందరూ ఆయన మొదటి సినిమా మల్లేశం అనుకుంటారు కానీ ఆయన 1989లో విడుదలైన దాసి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కానీ ఆ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు దక్కలేదు.

    బతుకు బండి సాగించడం కోసం ఎన్నో పనులు చేసినా ఎప్పటికైనా మంచి నటుడిగా నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటా అని ఆయన గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అలా మల్లేశం సినిమాతో 30 ఏళ్ల తరువాత నటుడిగా తనకు పునర్జన్మ లభించినట్లయింది ఆయన చెబుతూ ఉంటారు. ఇక చాలా వరకూ తాను పోషించిన పాత్రలు దాదాపు తండ్రి పాత్రలేనని, అయితే తండ్రి పాత్రలో కూడా తాను అన్వేషించేది గతంలో చేసిన పాత్రలకు ఇప్పుడు చేయబోతున్న పాత్రలకు వైవిధ్యం ఉన్నదా లేదా అనే విషయం అని ఆయన చెబుతుంటారు.

    ఆయన చేసిన సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కానున్నాయి. శేఖర్ కమ్ముల నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో ఆయన సాయి పల్లవి తండ్రి పాత్రలో నటించారు. ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో, జీవో నెంబర్ 111 సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఇక ఊరికి ఉత్తరాన అనే సినిమాలో కూడా హీరో తండ్రి పాత్రలో నటించారు. ఇక ఆయన నటించిన 12 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవుతుండడం గమనార్హం. అలా చేసిన దాదాపు అన్ని సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ ఆయన టాలీవుడ్ తండ్రి పాత్రల స్పెషలిస్ట్ గా మారిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    Tollywood Actor Ananda Chakrapani of Mallesham fame is celebrating his birthday today. here is a special article.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X