twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరింత రసవత్తరంగా 'మా' ఎన్నికలు...నాలుగో వ్యక్తి ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే!

    |

    టాలీవుడ్ లో జరగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోసియేషన్ లో ఉండేది 900 మంది సభ్యులే కానీ ప్రతిసారి ఈ ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతూ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ముగ్గురు కీలక వ్యక్తులు పోటీలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు 4వ పేరు తెరమీదకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    మరో పేరు తెరమీదకు

    మరో పేరు తెరమీదకు

    ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న సినీ నటుడు నరేష్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ క్రమంలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పటి నుంచే రసవత్తరంగా మారాయి. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే మా అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కుర్ర హీరో మంచు విష్ణు, సీనియర్ నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్ పోటీలో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరికి తోడుగా మరో పేరు తెరమీదకు వచ్చింది.

     ఉపాధ్యక్షురాలిగా ఉన్నా

    ఉపాధ్యక్షురాలిగా ఉన్నా

    తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిగా మంచి పేరు ఉన్న హేమ ఇప్పుడు మా అధ్యక్ష బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. తన వాళ్ల కోసమే పోటీలోకి దిగుతున్నాను అని చెబుతున్న ఆమె పోటీకి సంబంధించి మరి కొన్ని కీలక కామెంట్లు చేశారు. మా అసోసియేషన్ లో గత కొన్నాళ్లుగా తాను ఉపాధ్యక్షురాలిగా ఉన్నానని ఆమె వెల్లడించారు. అంతే కాక సంయుక్త కార్యదర్శిగా, ఈసి సభ్యురాలిగా పలు రకాల పదవులు చేపట్టానని చెప్పుకొచ్చారు. చేపట్టిన అన్ని పదవులకు న్యాయం చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

    వెనక్కి తగ్గాలని భావించా

    వెనక్కి తగ్గాలని భావించా

    ఈసారి కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు రానే వచ్చాయి అని చెబుతూ ముందు ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని భావించానని వెల్లడించారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చాక తన ఆలోచన మారిందని ఎలక్షన్ ప్రకటించగానే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ వంటి వారు పోటీ చేస్తున్నారని తెలిసిందని అన్నారు. ఇలాంటి పెద్దలు బరిలోకి దిగుతున్నారు అని తెలిశాక వెనక్కి తగ్గాలని భావించానని చెప్పుకొచ్చింది.

     పెద్దల వివాదాల్లో మనం ఎందుకు

    పెద్దల వివాదాల్లో మనం ఎందుకు

    పెద్దల వివాదాల్లో మనం ఎందుకు తల దూర్చాలి ? వారితో మనం ఎందుకు పోటీ పడాలి అని భావిస్తూ అసలు పోటీ కూడా చేయకూడదని భావించానని అందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిన్న ప్రకటించానని ఆమె వెల్లడించారు. కానీ ఆ ప్రకటన చేసిన తర్వాత సినీ ప్రముఖుల నుంచి చాలా ఒత్తిడి వచ్చిందని తాను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన సమయంలో తన స్నేహితులు, తనకు మద్దతుగా నిలబడిన సినీ ప్రముఖులు అందరు ఫోన్ చేసి నువ్వెందుకు పోటీలో నిలబడ కూడదని ప్రశ్నించారని, అలాగే నువ్వు ఉంటే బాగుంటుందని ఒత్తిడి చేశారని వెల్లడించారు.

    వారి కోసమే పోటీ

    వారి కోసమే పోటీ


    నువ్వు కూడా బరిలో ఉంటే బాగుంటుందని ఎవరైనా కష్టాల్లో చెప్పుకోవాలంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు, కాబట్టి నువ్వు కూడా బరిలో దిగితే బాగుంటుందని అడిగారని చెప్పు వచ్చింది. ముందు పోటీ చేయకూడదని భావించినా ఇప్పుడు పోటీ చేయమని తనను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒత్తిడి చేస్తున్నారని అందుకే తనను ఉపాధ్యక్షురాలిగా గెలిపించిన అందరికోసం ఇప్పుడు మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను ఆమె వెల్లడించారు.

    English summary
    Movie Artist Associations (MAA) Elections are coming once more. actress Hema is going to contest in MAA Elecctions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X