For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అస్త‌మించిన సూర్యుడు శ్రీహ‌రి... ఆయన చనిపోయే ముందు.. RX 100‌లో డాడీగా శ్రీహరే.. దర్శకుల భావోద్వేగం

  |
  Tollywood Actors & Directors Emotional About Srihari || Filmibeat Telugu

  స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం రాజ్ ధూత్. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకులు అజయ్ భూపతి, ఇ సత్తిబాబు, ర‌వి కుమారి చౌద‌రి, దేవీ ప్రసాద్, ఇతర సినీ ప్రముఖులు శ్రీహరి గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. వారేమన్నారంటే..

  ఆయన బతికి ఉంటే డాడీగా

  ఆయన బతికి ఉంటే డాడీగా

  అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ, మా జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్స్ అంతా గొప్ప ఆర్టిస్ట్ ను మిస్ అయ్యాం. ఆయ‌న ఉండుంటే నా ఆర్ ఎక్స్ 100 లో డాడి పాత్ర శ్రీహ‌రిగారిని బ్ర‌తిమ‌లాడి చేయించేవాడిని. ఈ సినిమా టీజ‌ర్ టీజ‌ర్ బాగుంది. హీరో లో మాసివ్ లుక్ ఉంది. ఆర్ ఎక్స్ 100లా రాజ్ ధూత్ పెద్ద హిట్ `అవ్వాలన్నారు.

  ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ, ` ఇందులో మంచి పాత్ర చేసా. మేఘాంశ్ మంచి న‌టుడ‌వుతాడు. ద‌ర్శ‌క‌, నిర్మాత చాలా ప్లానింగ్ తో చేసారు. పెద్ద స‌క్సెస్ అవుతుంది` అని అన్నారు.

  శ్రీహరి లవ్‌స్టోరీ నాకు తెలుసు

  శ్రీహరి లవ్‌స్టోరీ నాకు తెలుసు

  రాజా ర‌వీంద‌్ర మాట్లాడుతూ, ` శ్రీహ‌రి- శాంతి గారు పెళ్లికి కాక ముందునుంచి ప‌రిచ‌యం. వాళ్లిద్ద‌రి ల‌వ్ స్టోరీ కూడా తెలుసు. శ్రీహ‌రి అన్న‌య్య డేట్లు నేనే చూసేవాడిని. శ్రీహ‌రితో ప‌ర‌చ‌యాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. డ‌బ్బు గురించి ఎప్పుడు ఆలోచించ‌లేదు. చాలా మందికి ఎన్నో స‌హాయాలు చేసేవారు. ఈరోజు ఆయ‌న ఉండుంటే చాలా ఆనందించేవారు. మంచి మ‌నుషులు ఎక్కువ కాలం ఉండ‌రు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అని అన్నారు.

  శ్రీహరి వల్ల ఎంతో మంది బాగా

  శ్రీహరి వల్ల ఎంతో మంది బాగా

  ఫైట్ మ‌స్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ, ` మేఘాంశ్ నీతో సినిమా చేసిన వాళ్ల‌ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోకు. ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇక్క‌డ ఎవైరా ఏదైనా అవ్వొచ్చు. శ్రీహరి గారి వ‌ల్ల ఎంతో మంది వివిధ రంగాలో సెటిల్ అయ్యారు. రాజ‌కీయాలలో కూడా ఉన్నారు. తొలి నిర్మాత దేవుడు. నేను ఇలా ఉండ‌టానికి కార‌ణం శ్రీహ‌రి గారే. శ్రీహ‌రి గారు ఎప్పుడూ రియ‌ల్ స్టారే. ఆయ‌న రుణం ఎవ‌రూ ఎప్ప‌టికీ తీర్చుకోలేరు. స‌త్యానారాయ‌ణ గారు మేఘాంశ్ ని హీరో పెట్టి సినిమా చేసినంద‌కు కృత‌జ్ఞ‌త‌లు. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.

  నిర్మాతగా ఉన్నానంటే శ్రీహరే కారణం

  నిర్మాతగా ఉన్నానంటే శ్రీహరే కారణం

  నిర్మాత బెల్ల‌కొండ సురేష్ మాట్లాడుతూ, ` నేను నిర్మాత‌గా ఉన్నానంటే కార‌ణం శ్రీహ‌రిగారే. నాకు ఇండ‌స్ర్టీలో హీరోల‌ను, టెక్నిషియ‌న్ల‌ను ఆయ‌నే వ‌ల్లే ప‌రిచయం అయ్యారు. ఆయ‌న ఉండేంటే చాలా మంది నిర్మాత‌లు ఇండ‌స్ర్టీకి వ‌చ్చే వారు. ఎంతో మందికి స‌హాయం చేసిన గొప్ప వ్యక్తి. మ‌హా స‌ముద్రంలాంటి మ‌హా వ్య‌క్తి. ఆయ‌న మ‌న మ‌ద్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట క‌రం. ఇప్పుడు శ్రీహ‌రిగా రి అబ్బాయి హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. సినిమా పెద్ద విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.

  శ్రీహరిలా మేఘాంశ్ కూడా

  శ్రీహరిలా మేఘాంశ్ కూడా

  డైరెక్ట‌ర్ ఇ.స‌త్తిబాబు మాట్లాడుతూ, `శ్రీహ‌రిగారితో వియ్యాల వారి క‌య్యాలు సినిమా చేసా. ఇప్పుడు వాళ్ల అబ్బాయి హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌డం సంతోషంగా ఉంది. ఇంట్రెస్టింగ్ లైన్. సినిమా మంచి స‌క్సెస్ అవుతుంద‌ని ఈ స‌త్తిబాబు అన్నారు.

  నిర్మాత అభిషేక్ మాట్లాడుతూ, ` శ్రీహ‌రిగారిలా , మేంఘాంశ్ పెద్ద పేరు సంపాదించాల‌ని కోరుకుంటున్నా. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.

   శ్రీహరి తొందరపడి పోయాడని

  శ్రీహరి తొందరపడి పోయాడని

  డైరెక్ట‌ర్ దేవి ప్ర‌సాద్ మాట్లాడుతూ, ` తొంద‌ర‌ప‌డి మ‌ధ్నాహ్న‌మే అస్త‌మించిన సూర్యుడు శ్రీహ‌రిగారు. న‌న్ను మొద‌టిగా ద‌ర్శ‌కుడిగా గుర్తించింది ఆయ‌నే. ఆయ‌న హీరో అవ్వ‌క ముందు నుంచే తెలుసు. మేము అసిస్టెంట్స్ ఉన్న‌ప్పుడు క్యారెక్ట‌ర్లు చేసారు. మంచి ఇంప్రెసన్ ప‌డితే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నాకు ద‌ర్శ‌కుడిగా పిలిచి అవ‌కాశం ఇచ్చిన వ్య‌క్తి. మేఘాంశ్ తండ్రి గా ఇందులో న‌టించాను. శ్రీహ‌రి గారి అబ్బాయి అన‌గానే న‌టించేస్తాను చెప్పా. ఇద్ద‌రు గ్రేట్ ఆర్టిస్టుల క‌డుపున మేఘాంశ్ పుట్టాడు. అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంది. పెద్ద అబ్బ‌యి డైరెక్ట‌ర్ అవుతున్నాడ‌ని తెలిసింది. ఎక్క‌డున్నా వాళ్ల‌కి ఆశీర్వాద‌లు ఉంటాయి. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి సినిమా చేయ‌డం చిన్న విష‌యం కాదు. కానీ చాలా చ‌క్క‌ని కో ఆర్డినేష‌న్ తో చేసారు. పాట‌లు బాగున్నాయి. అంద‌రికీ పేరుతో పాటు, నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి` అని అన్నారు.

  క్లాప్ కొట్టే అవకాశం వచ్చింది

  క్లాప్ కొట్టే అవకాశం వచ్చింది

  ర‌వి కుమారి చౌద‌రి మాట్లాడుతూ, `1994లో సాగ‌ర్ అమ్మ‌దొంగ సినిమాకు అప్రెంటీస్ గా ప‌నిచేసా. నాకు ఎప్ప‌టి నుంచో క్లాప్ కొట్టాల‌నే ఆశ ఉంది. ఎప్పుడూ విన‌య్ కొట్టేవాడు. కానీ శ్రీహ‌రిగా వ‌ల్ల క్లాప్ కొట్టే అవ‌కాశం అప్పుడు నాకు వ‌చ్చింది. నా జీవితంలో తొలిసారి శ్రీహ‌రి మీద క్లాప్ కొట్టి సింగిల్ టేక్ లో ఒకే చేసింది . ఆరోజే న‌న్ను ఇండ‌స్ర్టీని దున్నేస్తావు అన్నారు. ఇలా ఆయ‌న‌తో ఎంతో అనుబంధం ఉంది. శ్రీహ‌రి గారు ఉండుంటే అక్ష‌ర ఫౌండేష‌న్ చాలా బాగుండేది. మ‌ళ్లీ ఎప్పుడు ఆ ఫౌండేష‌న్ ప్రారంభించినా నా స‌హ‌కారం ఉంటుంద‌`న్నారు.

  నా దగ్గరే పనిచేశారని

  నా దగ్గరే పనిచేశారని

  ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, ` అర్జున్ -కార్తీక్ నాలుగేళ్లు నా ద‌గ్గ‌ర ప‌నిచేసారు. రాజ్‌దూత్ క‌థ నాలుగేళ్ల క్రితం చెప్పారు. ఏడాది క్రితం శ్రీహ‌రి గారి అబ్బాయితో చేస్తున్నామ‌ని చెప్ప‌గానే సంతోషించా. అర్జున్-కార్తీక్ హ్యూమ‌ర్ బాగా రాస్తారు. కామెడీ బాగుందన్నారు. అదీ అర్జున్ -కార్తీక్ మార్క్. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి` అన్నారు.

  శ్రీహరి గారు చనిపోయే ముందు

  శ్రీహరి గారు చనిపోయే ముందు

  ఆదిత్య మీన‌న్ మాట్లాడుతూ, ` శ్రీహ‌రి గారిని చ‌నిపోయే ముందు క‌లిసా. అప్పుడే ఆయ‌న మంచి త‌నం తెలిసింది. కానీ ఆయ‌న‌తో ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. వాళ్ల అబ్బ‌యితో చేయ‌డం సంతోషంగా. మంచి నిర్మాత‌. ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఆయ‌న మ‌రిన్నిమంచి సినిమాలు చేయాలి. ద‌ర్శ‌కులు కొత్త థాట్ తో సినిమా చేసారు అని అన్నారు.

  English summary
  Tollywood's late actor Srihari son Meghansh is introducing as hero with Rajdoot movie. This movie pre release event organised in Hyderabad on Sunday June 30th. In this occassion, Srihari wife Shati Srihari gets emotional and wishes best luck for her son
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X