శోభన్ బాబు డెత్ మిస్టరీ.. అందాల నటుడు మరణం వెనుక అసలు కారణం తెలుసా?

అందగాడు, టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1959 నుంచే ఈయన చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. ఆ తరం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. 1996 వరకు వరస చిత్రాలతో అలరించారు. హీరోగా ఆయన 230 చిత్రాల్లో నటించి మెప్పించారు. 10కి పైగా ఆయన నటించిన చిత్రాలు థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడాయి. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఇక ఆయన 1937లో జనవరి 14న ఉప్పు సూర్యనారాయణ రావు, రమా తులసమ్మ దంపతులకు జన్మించారు.

శోభన్ బాబుకు ముగ్గురు చెల్లెళ్లు ఝాన్సీ, నిర్మల, ధనరంగ, సోదరుడు సాంబశివ రావు ఉన్నారు. ఇక శోభన్ బాబు తన 71వ వయస్సులో తుదిశ్వాస విడిచారు. 2008 మార్చి 20న ఆయన కన్నుమూశారు. అయితే శోభన్ బాబు మరణానికి గల కారణాలు పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. రీసెంట్ గా శోభన్ బాబు గురించి బంధువు బాలకృష్ణ ఒకరు మాట్లాడుతూ ఆయన మరణానికి గల కారణాలను వెల్లడించారు.. 'శోభన్ బాబు గారెకి ముగ్గురు చెల్లెళ్లు ఒక సోదరుడు. ఇంట్లో వాళ్లందరినీ ఆయనే చూసుకున్నారు. ఆయన సినీ పరిశ్రమలో అడుగు పెడుతుండగానే ఒక చెల్లెళ్లు చనిపోయారు. దాంతో ఆమె కొడుకు సురేశ్ ను తీసుకొచ్చి కెమెరామెన్ చేశాడు. ఇక రెండో చెల్లెలు ఝాన్సీ కూడా చనిపోయారు. ఆ సమయంలో చాలా బాధ పడ్డాడు.

Tollywood Legendary Actor Sobhan Babu Death Mystery

కానీ ఆయన చాలా కాలం బతుకుతానని చెప్పుకునే వారు. 100 ఏళ్లు బతుకుతానని చెప్పే వారు. వాళ్ల తాత గారు 100 ఏళ్లు బతికారు, వాళ్ల నాన్న 90 ఏళ్లు బతికారు. ఆయన డైట్, ఎక్సర్ సైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లలా బతుకుతానని అనేవారు. ఇక ఆయన హార్ట్ ఎటాక్ తోనే చనిపోయారు. చనిపోయే రోజు అందరితో మాట్లాడి తన గదిలోకి వెళ్లారంట. కాఫీ తీసుకొని రమ్మని చెప్పారంట. కాఫీ చెప్పి తీసుకొచ్చే లోపే ఆయన గదిలో పడిపోయి ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

అలాగే శోభన్ బాబు గారు పుట్టిన రోజుకు మాత్రం అంతా కలుస్తూ ఉంటాం. నేను ఆయనకు 11 గంటలకే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి బాలకృష్ణ కాల్ చేశాడంటే శోభన్ బాబు ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే బాగున్నావా? అని అడిగేవారు. నువ్వు ఎన్ని ఇబ్బందులైన పడుగానీ, ఫ్యామిలీని మాత్రం ఇబ్బందుల పాలు చేయకు అని చెప్పేవాడు. సినిమా అవకాశాల కోసం చూస్తూ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేవారు.

ఇక శోభన్ బాబు నటించిన చిత్రాల్లో మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణతో కలిసి కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఆయనకు నట భూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు అనే బిరుదులు కూడా ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X