‘సూపర్ హిట్ లేదా డిజాస్టర్.. పోస్టర్ డబ్బులు కూడా.. అలా చేస్తే నాశనమే’

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సన్నిహితుడిగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దగ్గర ఉద్యోగం చేసి ఆత్మీయుడిగా మారిపోయాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కొన్నేళ్ల పాటు పని చేసి ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఇక కొన్నాళ్ల నుంచి ఆయనే ఇంట్రెస్టింగ్స్ ప్రాజెక్ట్స్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మారి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈయన జీఏ2 బ్యానర్ పార్టర్న్ కూడానూ. అల్లు అరవింద్ తో కలిసి ఈ బ్యానర్ ను కూడా నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్లో తొలుత 100% చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం, భళే బళే మోగాడివోయ్, గీతా గోవిందం, ప్రతి రోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్, కోట బొమ్మాళి ఐపీస్ తో పాటు చివరిగా నాగ చైతన్యతో చివరిగా తండేల్ చిత్రంతో హిట్ ను అందుకున్నారు.

Tollywood Producer Bunny Vasu Alert to That category Producers

ఇలా వరుసగా హిట్స్ అందుకుంటున్న నిర్మాత బన్నీ వాసు తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. హిట్ సినిమాలు, డిజాస్టర్ సినిమాల ప్రొడ్యూసర్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నాతో పాటు ప్రతి ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్ట మొదటిగా మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే నష్టాలు చూడాల్సి వస్తుంది. ప్రేక్షకులు మన పేరును, మన బ్యానర్ పేరును మర్చిపోతున్నారని ఎక్కువ పరిగెట్టి, సినిమాలను రన్ చేయాలని చూస్తే ఇప్పుడున్న సిచ్యూయేషన్ లో డబ్బులు పోతాయి.

మునుపటిలాగా ఇప్పుడు మినిమమ్ సేఫ్ అనేలా సినిమాలు లేవు. రెండే ఉన్నాయి డిజాస్టర్, సూపర్ హిట్. సూపర్ హిట్ అయితే డబ్బులు మిగులుతాయి. డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా కావొచ్చు. ఈరోజుల్లో మినిమమ్ సేఫ్ అనేది సినిమాల్లో అయితే లేదు. చాలా కష్టం.' అని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. బన్నీ వాసు చివరిగా నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించి తండేల్ తో రూ.100 కోట్ల వరకు వసూళ్లను అందుకున్నారు. ఈ చిత్రానికి చందూ మొండేటీ దర్శకత్వం వహించడం విశేషం.

ఇక బన్నీ వాసు తాజాగా కన్యా కుమారి అనే చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఇలా మాట్లాడారు. ఇక కన్యా కుమారి చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీ చరణ్ రాచకొండ, గీత్ సైని ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం. భద్రం, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Read more about: bunny vas tollywood thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X