Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోకు సరి సమానంగా.. మొదటిసారిగా ఓ దర్శకుడికి భారీ కటౌట్.. వైరల్ పిక్
ఒకప్పుడు హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే భారీ క్రేజ్, ఫాలోయింగ్ ఉండేవి. అయితే వారిద్దర్నీ అంత గొప్పగా మలిచే దర్శకులకు అంతటి అభిమాన గణం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒక సినిమా హిట్ అయినా, ఫట్ అయినా అందులో దర్శకుడిదే అగ్రభాగం ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాంటి వాడు. అతని చేతిలో సినిమా భవిష్యత్తు, ఫలితం ఆధార పడి ఉంటుంది.

దర్శకులకు పెరిగిన క్రేజ్..
రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులకు ప్రస్తుతం హీరోలతో సరిసమానంగా క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియా ఉపయోగం పెరిగాక అందరికీ అన్ని విషయాలు తెలుసిపోతున్నాయి. ఓ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుల కష్టాలు ఎలా ఉంటాయి? తాము అనుకున్న కథను తెరపై చూపించడానికి వారు పడే అవస్థలు, నటీనటుల నుంచి నటనను రాబట్టుకునే విధానం ఇలా ప్రతీ ఒక్కటి దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది.

దర్శకుడికి అగ్రపీఠం..
బాహుబలి లాంటి సినిమాలతో దర్శకుడి స్టామినాను మరోసారి చూపించాడు రాజమౌళి. ఒకప్పుడు హీరోలను చూసి సినిమాకు వెళ్లే అభిమానులు, ఇప్పుడు దర్శకుడిని చూసి వెళ్తున్నారు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి డైరెక్టర్ల సినిమాలు వస్తున్నాయంటే అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతోంది.

త్రివిక్రమ్ శైలి ప్రత్యేకం..
దర్శకులందరిలోనే త్రివిక్రమ్ శైలి వేరు. జనాలు మామూలుగా మాట్టాడుకునే భాష, యాస, పదాల్లోంచే అందమైన, ఆలోచనలు రేకెత్తించేలాంటి డైలాగ్‌లు రాయడం త్రివిక్రమ్‌కే చెందుతుంది. త్రివిక్రమ్ సినిమాల్లో మాటలే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అందుకే ఆయన్ను మాటల మాంత్రికుడు అంటూ పిలుస్తుంటారు. త్రివిక్రమ్ సినిమా అంటే అందరికీ అంచనాలు ఆకాశమంతా ఎత్తులో ఉంటాయి.

అల వైకుంఠపురములో సినిమాతో బిజీ..
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్.. అరవింద సమేత లాంటి చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ సరసన భారీ కటౌట్..
అల వైకుంఠపురుములో ఇప్పటికే ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన అల వైకుంఠపురములో.. టీజర్‌తోనూ దుమ్ములేపింది. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంలో ఫ్యాన్స్‌లో జోష్ నిండిపోతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో పాటు అతని పక్కనే త్రివిక్రమ్‌కు అదే సైజ్‌లో కటౌట్ పెట్టారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. థమన్ కేక అంటూ ట్వీట్ పెట్టారు.