Don't Miss!
- News
Basara: బాసర సరస్వతి క్షేత్రానికి భారీగా తరలొచ్చిన భక్తులు
- Finance
Budget 2023: దేశంలోని పెద్ద రైతులపై పన్ను వేయాల్సిన సమయం వచ్చేసిందా..? ఎందుకిలా..
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
SSMB28: మహేశ్‌ను వదిలేయబోతున్న త్రివిక్రమ్.. ఒక్కసారిగా ప్లాన్ మార్చేసిన గురూజీ
ఆ మధ్య కాలంలో కొన్ని పరాజయాలు పలకరించినా.. కొంత కాలంగా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే అతడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆరంభంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మహేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను షురూ చేసేశాడు.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!
దాదాపు పదమూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది. దాని తర్వాత రెండో షెడ్యూల్‌ను మొదలుపెట్టాలని భావించినా పలు అనివార్య కారణాల వల్ల ఇది మాత్రం ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను జవనరి 17వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నారని ఇప్పటికే ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఇంక ఏమాత్రం బ్రేకులు లేకుండా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు, ముందుగా త్రివిక్రమ్.. మహేశ్ బాబుకు సంబంధించిన పార్టును పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. అతడి సన్నివేశాలను షూట్ చేసిన తర్వాత ఈ చిత్రం నుంచి రిలీవ్ చేయబోతున్నాడట. అంటే.. అందరి కంటే ముందే మహేశ్ ఈ చిత్రాన్ని పూర్తి చేయబోతున్నాడన్న మాట.
జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లను పరిశీలిస్తున్నారు.